పుట:Aandhrashaasanasabhyulu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకాకుళం జిల్లా

రొక్కం లక్ష్మీనరసింహదొర

కాంగ్రెస్ : టెక్కలి, నియోజకవర్గం వయస్సు : 66 సం., విద్య : న్యాయవాద పట్టభద్రుడు 1925 న్యాయవాదవృత్తి, శ్రీకాకుళంజిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షుడు, ఇదివరలో గంజాంజిల్లా బోర్డు సభ్యుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేటు సభ్యుడు, శ్రీకాకుళం కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు సలహాసంఘం అధ్యక్షుడు, 1952 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా మద్రాసు శాసనసభకు ఎన్నిక, కుప్పుస్వామి ప్రాథమిక విద్యావిచారణసంఘంలో, దేవాదాయ ధర్మాదాయ కమిటీలో, భూ సంస్కరణల కమిటీలో సభ్యుడు, ప్రస్తుతం ఆంధ్ర శాసనసభాద్యక్షుడు, అడ్రస్సు : కురుదు, కొత్తపల్లి పోష్టు.

గౌతు లచ్చన్న

కాంగ్రెస్ : సోంపేట నియోజకవర్గం, జననం : 16-8-1909, విద్య : స్కూలు ఫైనలు, 1930-31 లో ఉప్పు, కల్లు సత్యాగ్రహోద్యమాలలో కార్యకర్త, 1937 లో ఇచ్ఛాపురంలో రైతు విద్యాలయ నిర్వహణ, 1940 లో పలాసాలో జరిగిన అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ మహాసభకు ఆహ్వాన సంఘాధ్యక్షుడు. దానిని నిషేధించిన తదుపరి 1940-43 వరకు అజ్ఞాతవాసం, 1942-45 డిటెన్యూ, 1946-50 వరకు ప్రదేశ్ కాంగ్రెస్ సహాయ కార్యదర్శి, 1948-52 లో మద్రాసు శాసన సభాసభ్యుడు, 1952 ఎన్నికలకు పూర్వం రంగా తదితరులతో కలసి కాంగ్రెస్ నుండి నిష్క్రమణం, ఆంధ్రరాష్ట్ర ప్రథమము. త్రివర్గంలో 60 రోజులు వ్యవసాయ శాఖామంత్రి. ప్రస్తుత మంత్రివర్గంలో సభ్యుడు, ప్రత్యేక అభిమానం : గీతకార్మికుల సముద్ధరణ, అడ్రస్సు : బారువ, సోంపేట తాలూకా, శ్రీకాకుళం జిల్లా.


ఉప్పాడ రంగబాబు

కాంగ్రెస్ : ఇచ్ఛాపురం నియోజకవర్గం, జననం : 9-10-1925, విద్య : ఇంటర్ మీడియట్, 1942 లో రాజకీయాలలో ప్రవేశం, 1950 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సభ్యుడు, తరువాత ప్రజాపార్టీలోను, లోక్ పార్టీలోను సభ్యుడు, జిల్లా ప్రొహిబిషన్ కమిటీలోను, ప్లానింగు కమిటీలోను సభ్యుడు, అడ్రస్సు : ఇచ్ఛాపురం.