పుట:Aandhrashaasanasabhyulu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పొందుపర్చిన సంగతులవలన మనకు విశదమవుతుంది. కొండజాతులకు ప్రత్యేకించిన ఐదు (నాగూరు, సాలూరు, శృంగవరపు కోట, గూడెం, భద్రాచలం) నియోజకవర్గాలలో చాలా తక్కువ ఓట్లు పోలైనాయి. ముఖ్యంగా గూడెం నియోజకవర్గంలో 76,000 ఓట్లు ఉండగా 6,000 మాత్రమే పోలైనవి. ఈ ఐదు స్థానాలు పార్టీవారీగా కాంగ్రెస్ 1, ప్రజా సోషలిస్టు 1, కమ్యూనిస్టు 1, స్వతంత్రులు 2 సంపాదించుకొన్నారు.

ఈ ఎన్నికలలో కాంగ్రెస్, కమ్యూనిష్టు ముఖా ముఖీ పోటీలు రమారమి 70 నియోజకవర్గాలలో జరిగింది. ఈ పోటీలలో ముఖ్యమైన నియోజకవర్గాలు దివి, గన్నవరం, వుట్లూరు, ఒంగోలు వగైరా ప్రదేశాలు. సత్తెనపల్లి, నందిగామ, వుయ్యూరు, తిరువూరు, కూచనపూడి, మాడుగుల మొదలగుచోట్ల కూడా పోటీ చాలా తీవ్రంగా జరిగిందనే చెప్పాలి.