పుట:Aandhrashaasanasabhyulu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎన్నికల సమీక్ష

శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారి నాయకత్వాన నవ్యాంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తొలి మంత్రివర్గం పదమూడు మాసముల పదిహేను రోజులు అనంతరం మధ్య నిషేధ సమస్యపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఒక్క ఓటు తేడాతో నెగ్గటంతో పతనమయింది.

భారత రిపబ్లిక్ అధ్యక్షుడు డా|| రాజేంద్రప్రసాద్ ప్రత్యేక శాసనం ద్వారా ఆంధ్ర శాసనసభను రద్దుచేసి గవర్నరు పరిపాలనను ప్రవేశపెట్టారు. షుమారు నూట ముప్పది ఐదు రోజులు గవర్నరు పరిపాలన తదుపరి తిరిగి ఆంధ్ర శాసనసభకు ఫిబ్రవరి, మార్చి నెలలలో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలలో అర్హతకలిగిన ఓటర్ల సంఖ్య మొత్తం 1,15,68,859, ఇందు పోలైన ఓట్లు 86,30,311, ఎన్నికల కొరకు నిర్నయించిన నియోజకవర్గాలు 167, అందులో 29 ద్విసభ్య నియోజక వర్గాలు, కనుక ఎన్నిక జరుగవలసిన మొత్తం స్థానాలు 196. వీటిలో 26 షెడ్యూల్డు తరగతుల వారికి, 5 షెడ్యూల్డు జాతుల వారికి ప్రత్యేకించబడినాయి. మొత్తం దాఖలు అయిన నామినేషన్లు 950. అందులో నిరాకరించబడినవి 25, ఉపసంహరించబడినవి 344, ఇక పోటీ లేకుండా ఎన్నికైన ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్ధులుపోను, ఎన్నికల రంగస్థలంలో చివరిదాకా నిల్చి పోటీకి సన్నద్ధమైన వారి సంఖ్య 578, యిందు ఐక్య