పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

203 ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక.

చించిన తిరువాయ్ మొళియు, కులశేఖరులు, యామునులు, వీరలస్తోత్రములు రామానుజుల వారితత్త్వప్రకాశికయు బహుకాలమునకుఁ బూర్వమే యాంధ్రీకరింపఁ బడియున్నవి.

                 ఉ. కారణమస్తకస్థల విగాధసముత్కళికమ్యలబ్ధ భా
                     కారమునం గిరీటమణికాండ మెసంగఁ బొసంగ వీరశృం
                     గారతరంగపఙ్తు లనఁగాఁ గనకాంశుకగాంతకాంతు లెం
                     తే రహిఁ బన్ను నిన్నఖిలదేవవరేణ్యు శరణ్యు నెన్నెదన్.

(11) కళువె.వీరరాజు. (1645 A.D.)

ఇక్కవిరత్నము మహిసూరరాజాధిరాజగుదేవరాజునకును జిక్క దేవరాజునకును సేనాధిపతియై చోళపాండ్యమండలముల జయించి ముద్దళగిరిని గొంతకాలము తోలి మధురాపురమున నుండెను. ఇతఁడు భారతవచనకావ్యమును చిక్కదేవలీలయు రచించెను. ఇతనివచనభారతము వ్యాసరచితకథకుఁ దెనుఁగుగాని నన్నయఫక్కి ననుసరించినదికాదు. నన్నయభట్టారకుఁడే వచనమున మూలమును మార్పక తెనిఁగించి యున్నచో నది యెట్లుండునో యితనివచనము నంతగంభీరమై మిక్కిలి యింపుగా నున్నది. నాకాది పర్వముమాత్రమే చూడఁ దటస్థించినది. ఇతనికొమారుఁడును పెక్కులు వచనగ్రంథములు హాలాస్య, స్కాంధ, లైంగాదులు రచించెను. ఈవీరరాజున కంకితముగా నొకఛందోగ్రంథము వీరభూపాలీయము రచింపఁబడినది. అప్పకవి తనసామగ్రియంతయు నీ గ్రంథమునుండియే పూర్ణముగా గ్రహించుకొనె నని చెప్పుటకు మిక్కిలి లజ్జగా నున్నది. వీరభూపాలీయము పెద్దన లక్షణసారసంగ్రహము లేకున్న నప్ప కవీయమును, ముద్దరాజురామన కవిసంజీవనియు రత్నాకరము లేకున్నఁ గూచిమంచితిమ్మకవిలక్షణ సారసంగ్రహమును మనము చూచి నవ్వునంతటిభాగ్యము మనకు లేకుండును.

12. రేచర్ల.మాధవరాయలు (1680 A.D.)

ఇతఁడు జటప్రోలుసంస్థానవిభుండు. సర్వజ్ఞసింగమనాయని వంశజుఁడు. ఇతనిప్రపితామహు డగుమాధవరాయఁడు వాల్మీకిరామాయణమునకు సంస్కృతవ్యాఖ్యరచించెను. ఇతనితాతమల్లనృపతిబాలసరస్వతిచేభర్తృహరి తెనిఁగింపఁ జేసెను. ఇతఁడు చంద్రికాపరిణయమును రచించెను. బాలసరస్వతి రచించిన చంద్రికాపరిణయము సర్వవిధముల దీనికంటె శ్లాఘాపాత్రము. అనేకప్రబంధములను బిల్లవసుచరిత్ర లని పేర్కొనుచున్నారు గానియేల దీనిని వసుచరిత్రమునకుఁ బ్రతిబింబ మనిచెప్పనొల్లరో! దీని నిక్కవి తోరణాల చొక్కయ యనునియోగిపుంగవుని సాహాయ్యమున రచించినట్లు తెలియుచున్నది. అక్కవియు శూద్రోచ్ఛిష్టమునకుఁ బ్రతికల్పించుటకు సిగ్గుపడమిచే సహచరు లగువిద్వాంసులు

                     "తోరణాలచొక్క, దొంగకుక్క"

యనువసుచరిత్రపు పత్రమునుద్రోసిచెప్పిరఁట. అయిన నిక్కావ్యబంధము వసుచరిత్రవలె సులభముగాఁ గాక గాఢముగా నుండును. ఇదిచేపలబుట్ట యల్లినట్లు శిథిలబంధమున గూర్పఁబడక పదములబిగువు గలదుగాని యాదికవులకావ్యములోని పారిశుద్ధ్యము కాని తంజాపురితొండమాన్ మధురనాధుల రసస్ఫూర్తి గాని యిం దగపడదు. ఉత్ప్రేక్షాతిశయోక్తులకుఁ బుట్టినిల్లై శ్లేషలకు గని యైనను రాతికిం గోతికిం గలుగుబిడ్డలును గొండలఁ గాలిగోర నెగఁజిమ్ము మగలును నిందుఁ గానరారు. కృతి సుప్రసిద్ధమైనందున నుదాహరణము లనావశ్యకములు.

(13) గద్వాల సోమభూపతి (1700)

ఇతఁడు నైజామురాజ్యమున నుండుగద్వాలకుఁ బ్రభువు. ఇతనియాస్థానముననే భద్రాపరిణయము రచించిన కాణాదము పెద్దనసోమయాజి యుండినది.జీర్ణ రసాయనము : _ అజీర్ణవ్యాధులనుబాగుగనయముచేయును. వెల 1-4-0. అమృతాంజనముడిపోఫోర్టు, బొంబాయి