పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

200 ఆంధ్రపత్రిక సంవత్సారాది సంచిక

బ్రాహ్మణకవులభావములకంటె లీలార్ధము వచించిన రాజకావ్యములు గంభీరగుంభనలకు మేలైన వనుట యేమియాశ్చర్యము శ్రీరంగనిభుఁడు చూడుకుడుత్త నాంచారమ్మను బరిణయమైనకథయే ప్రధానముగాఁ గలయిక్కావ్యమున ఋతువర్ణనాదికము లతివిపులములై ప్రాచీనకృతుల నెగఁజూచుచున్నవి దీనిని బెద్దన రచించె ననుట కేవలవాదమే నిర్దోషమై బంధపాటవము గలకవిత చెప్పుపెద్దన భావముల నిమిడింపలేక చచ్చిచావనిపాకమునఁ గూర్పఁజాలడు. ఆముక్తమాల్యద నామూలము శోధించి చూచి ద్రవిడసంస్కృతములలో నక్కాలపు వైష్ణవుల కావ్యములతో నించుక పోల్చిచూచినచోనెవ్వఁడో వైష్ణవశిఖామణి యాంధ్రరచనాలోభవలన రచించి కృష్ణరాయలపేరిటఁ నెలకొల్పెనేమో యనుసందియము తోఁచుచున్నది. ఈవిషయమై నిదర్శనములు తత్కావ్యమునఁ బెక్కులు గలవు.

(5) కట్ట-వరదరాజభూపతి. (1560. క్రీ.శ.)

ఇతఁడు కృష్ణరాయలయల్లుఁ డగురామరాయల పినతల్లికొమరుఁడు. ఇతఁడు శ్రీరంగమాహాత్మ్య మను దశాశ్వాసముల గ్రంథము రచించి శ్రీరంగపతి కంకితమిచ్చెను. అపారమాధుర్యము గలయితనికవిత చాల మృదువై జాతీయమై ప్రాచీనకవుల నడక ననుసరించి యున్నది. భైరవుం డనువిప్రకవియు శ్రీరంగమహత్వమును రచించెను. దుష్కలి ఘోరపిశాచము లదల్చు గురుభైరవుం డగు భైరవుని కవితాప్రవాహమున కిక్కవి వాక్పుష్పదామములు నులువఁజాల కున్నను వర్షాంతపు నదివోలె నదినీరసమగుచుండ నిత్యపరిమళశోభితంబగు వరదరాజకృతి సరసమై పండిత భృంగముల కాకర్షణ యంత్రమ వలె నున్నది. ఇతఁడు మఱియుఁ బరమభాగవత చరిత్రమును రామాయణ ద్విపదయు రచియించెను. ఇతని కావ్యములలోనుండి యొండు రెండుదాహరించుటయు మేలు.

              ఉ. ఏలతదన్యతీర్థముల కేల జవాళి మహాసరస్వతీ
                  కూలనికుంజమంజు రుగల్మలతావళి దెఱిచూచినన్
                  బాలిశకోటిజిహ్వలను భారతి తాండవ మాడు బ్రహ్మయి
                  ల్లాలట యమ్మహానది ప్రియాశయముల్ తమ కీయ జాలదే.

              సీ. కదలునో పూరేకు ♦ లదరి తేనెలు చిందఁ
                  దనయిచ్చఁ బవనకం ♦ దళచయంబు
                  మెదలవచ్చు నె మందు ♦ మించినెత్తమ్ములు
                  ముగిడింప జక్కవ ♦ పగఱకైనఁ
                  గాయునో బీఱెండ ♦ కామినీవదనముల్
                  చెమరింప వేసవిఁ ♦ గుముదవైరి
                  కురియునో సస్యవి ♦ స్ఫురణకై తగినట్టి,
                  వానమాత్రమ కాక ♦ వారిదములు

              తే. మిసుకవచ్చు నె రుజు ♦ లర్విమీఁద నిచటఁ
                  గిముకు మనవచ్చునో యమ ♦ కింకరులకు
                  నెపుడు మదనుగ్రహములేక ♦ యిహపరైక
                  మంగళప్రద మైన శ్రీ ♦ రంగమునను

_________

              సీ. అత్తమామల కెదు ♦ రాడుదుశ్చారిణి
                                వావివర్తన లేని ♦ వాడవదినె
                  కొండ్యాలఁ గొంపలు ♦ కూల్చుపాతకురాలు
                                బలిబిక్ష మెడనిని ♦ ర్భాగ్యనసతి
                  మగనితో నేవేళ ♦ జగడించు జగ జంత
                                పసిబిడ్డలను దిట్టు ♦ పాపజాతి
                  దినము నేబాసలు ♦ దెగిసేయునడిగొంటు
                                క్షుళ్ళకంబులు దెచ్చు ♦ ముళ్ళమారి

              తే. కాసు ప్రాణంబుగాఁ జూచు ♦ కష్టురాలు
                  పఱపకూఁతలు గూయు ♦ దబ్బరలదాని
                  వెలనిమేలు సహింపని ♦ చితివిషంబు
                  దీనికై నీవు కనికర్ద ♦ మానఁదగునె.

_______

(6) గంగప్పరాజు (1560 A.D.)

ఇతడళియరామరాయల పెదతండ్రికొమారుఁడు ఈకవిశిఖామణి సాంబోపాఖ్యాన మనుకృతి రచించి శ్రీరంగనాథున కంకిత మిచ్చెను. "అగువన నిక్కవిచంద్రుడు ! జగతి నపూర్వార్థశబ్దచారుకవితమై | నెగడిన బాణోచ్చిష్టం జగత్త్రయం బవిన పలుకు సఫలం బయ్యెన్" అనిన కేతనభావ మిక్కవి కన్వయ మగు నంతశబ్దార్థరచనావైశద్యమ ను జూపిఆంధ్రపత్రిక : _ ను చదివి సంతోషింపినివారులేరు. ఉద్యోగస్థులకు, వర్తకులకు న్యాయవాదులకు, ప్రయివేటు ప్లీడరులకు, కరణములకు, కాపులకు ఎవరికి సంబంధంచినవి ఆయావార్తలుండును. చందా సం||ర 2-2 లు మాత్రమే.