పుట:Aandhranaamasangrahamu aandhranaamasheishhamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ. నీరుపాప గాలి - నెచ్చెలి యన్నింటి
తిండికాఁడు కప్పుఁ - దెరువుజాడ
యంటరానివేల్పు - జంటమోములసామి
యగ్గి యనఁగ నొప్పు - ననలుఁ (డీశ). 18


తే. జమునసైదోడు పెతరుల - సామి జముఁడు
ప్రొద్దుకొమరుఁడు గుదెతాల్పు - పోతుజక్కి
నెక్కియాడెడుబలురౌతు - దక్కిణంపు
సామి యన నంతకుం డొప్పు - (శ్రీమహేశ). 19


ఆ. మూలఱేడు సోఁకు - మూఁకలఱేఁడు రే
ద్రిమ్మరీఁడు పొలసు - దిండిపోతు
రక్కసుండు నల్ల - ద్రావువాఁ డనఁగను
నిరృతిపేళ్లు సెల్లు - (నీలకంఠ). 20