పుట:Aandhranaamasangrahamu aandhranaamasheishhamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. గట్లరాయనిపట్టి ము - క్కంటివెలఁది
యేనుఁగులగొంగతత్తడి - నెక్కుదంట
సామిసామేనిఁ జేకొన్న - చాన జగము
తల్లి యన గౌరిపేళ్లొప్పు - (ధర నుమేశ) 9


తే. లచ్చి కలుములజవరాలు - పచ్చవిల్తు
తల్లి కఱివేల్పునిల్లాలు - తల్లితల్లి
కడలికూఁతురు సిరి లిబ్బి - పదఁతి తమ్మి
యింటిగరి తన శ్రీయొప్పు - (మృగధరాంక) 10