పుట:Aandhranaamasangrahamu aandhranaamasheishhamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శతమఖముఖసురనుతిసం
గతికిన్‌ మహిమోన్నతికిని - గాశీపతికిన్‌. 2

తే. అంకిత మొనర్తుఁ దెనుఁగుపే - ళ్లరసి కూర్చి
గరిమతో నాంధ్ర నామసం - గ్రహ మనంగ
నమరుకృతిఁ బైడిపాటి యే - కామ్రమంత్రి
సుతుఁడఁ గవిలక్ష్మణాఖ్యుఁడ - సుజనహితుఁడ. 3


అవ. గ్రంథకర్త తాను రచియింపదలచిన గ్రంథము నందలి పరిభాషను దెలుపుచున్నాడు.---

తే. దేవమానవస్థావర - తిర్యగాఖ్య
వర్గు లొనరింతు నానార్థ - వర్గుఁ గూడ
వర్గములు గాఁగఁగూర్తు నా - హ్వయమునందు
నిడుదు వివరించునెడల సం - స్కృతపదంబు. 4