పుట:Aandhranaamasangrahamu aandhranaamasheishhamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

ఆంధ్రనామసంగ్రహము

సటీకము.

అవతారిక:- పైడిపాటి లక్ష్మనకవి యాంధ్రనామసంగ్రహ మనెడి గ్రంథమును రచింపబూని, తాను జేయ బూనిన యీగ్రంథము నిర్విఘ్నముగ బరిసమాప్తి నొందుటకై తన యిష్టదేవతా నమస్కారరూప మైన మంగళము నాచరించి, యికమీదను గ్రంథకర్తలాదిని మంగళము జేయుదురుగాక యను తలంపుతో నామంగళమును బద్యరూపముగా గ్రంథారంభమున జేర్చుచున్నాడు. రెండవ మూడవ పద్యములందు గవి తన పేరును, గ్రంథనామమును, ఆగ్రంథ విషయములను, కృతిపతిని దెలియ జేయుచున్నాడు ---

క. శ్రీపతివంద్యు విశాలా
క్షీపతిని భజించి యిష్ట - సిద్ధులు వరుసన్‌
బ్రాపింపఁగ గణనాథుని
శ్రీపాదంబులకు నెఱఁగి - చెందిన వేడ్కన్‌. 1

క. నతభక్తలోకరక్షా
రతికిం జంచత్కృపాత - రంగితమతికిన్‌