Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

67

నన్నయభట్టు

    
      గీ. వికటకవులు కొన్ని వింతలు గల్పించి
         కవిజనాశ్రయమున గలిపినారు
         వానిఁ గైకొనంగ వలదప్రయుక్తంబు
         నేల చెప్పు భీముఁ డెఱిఁగి యెఱిఁగి

ఇట్లప్పకవి లోనగువారు చెప్పిన వచనము లన్నియు నిరర్థకము లగును గదా ? ఇందలి గద్యమునందు " ఇతి శ్రీ వాగీంద్ర చూడామణి చరణ సరసీరుహ మధుకరాయమాన శ్రావకాభరణాంక విరిచితం బయిన కవి జనాశ్రయంబు"నని యున్నది కచిజనాశ్రయములో భీమన కొన్నిచోట్ల

      క. విత్రస్తాఘ పవిత్రచ
         రిత్ర త్రిదశవర వరధరిత్రీ సురస
         న్మి త్రాంబుజ మిత్ర గుణా
         మాత్ర యనుప్రాస మిదియు మల్లయరేచా

                                    ( కవిజ సంజ్ఞాదికారము 8 )

అని యిట్లు మల్లయరేచని సంబోధించియు, కొన్నిచోట్ల,

      సీ. వివిధచతుష్ఠష్టి విద్యల నజుఁ డని
                 విపులనయోపాయవిమల బుద్ధి
          నమరేంద్రగురుఁ డని యధిక తేజంబున
                 నాదిత్యుఁ డని సుందరాంగయుక్తి
          నంగజుం డని యీఁగి నంగాధిరాజని
                యలవున నభిమన్యుఁ డని సమస్త
          జనులు ముదంబున శ్రావకాభరణాంకు
                సత్కవికవిజనాశ్రయగుణాంకు

         బొగడుచుండుదు రని యిట్లు పూర్వరచన
         నలరఁ జెప్పిన పడి సీస మయ్యె దీని
         పశ్చిమార్థంబు వడి యొండుపాట నిలువ
         నదియె యంకిలివడిసీస మయ్యెఁ గృతుల


(కవిజ జాత్యధికారము l7)