Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

ఆంధ్ర కవుల చరిత్రము


ఈ కథ యబద్దమని చూపుటకు భీమకవి కృత మైన కవిజనాశ్రయ ఛంద మొకటి కనబఁడు చున్నది. ఈ ఛందస్సు మల్లయ రేచఁ డను కోమటిపేర భీమకవిచే రచియింపబడినది ఈ కవిజనాశ్రయము లో

      క. పరఁగిన విమలయశోభా
         సురచరితఁడు భీమనాగ్రసుతుఁ డఖిలకళా
         పరిణతుఁ డయ్యెను భూసుర
         వరప్రసాదోదిత ధ్రువ శ్రీయుతుడై
                           
                             (కవిజనాశ్రయము అధస్పూచిక పుట. 2)

      క. అసమానదానరవితన
         యసమానోన్నతుఁడు వాచకాభరణుడు ప్రా
         ణ సమానమిత్రుఁడీ కృతి
         కి సహాయుఁడుగా నుదాత్తకీర్తి ప్రీతిన్
                            
                             (కవిజ. పుట. 2 అధస్పూచిక

      క. అనవద్య కావ్యలక్షణ
         మొనరంగాఁ గవిజనాశ్రయుఁడు మల్లయరే
         చనసుకవి కవిజనాశ్రయ
         మను ఛందముఁ దెలుఁగు బాస నరుదుగఁ జెప్పెన్,
 
                             (కవిజ ప. శ్రీ)

ఆనీ భీమనాగ్రసుతుని తోడ్పాటుతో గ్రంథమును మల్లయ రేచన రచించినట్లు చెప్పబడినది. భీమనాగ్రసుతుఁ డనుచో 'దాక్షారామ భీమేశ నందనుఁడన్' అని కవిచెప్పుకొన్నట్లు భీమేశ్వర పుత్రుడగు భీమకవి యనియే యర్ధము చేయవలెనుగాని భీమకవి పుత్రుఁ డనిచేయఁ గూడదు. భీమకవి పుత్రుఁ డని యర్ధము చేసెడుపక్షమునఁ గవిజనాశ్రయము భీమకవి కృతమని