Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

ఆంధ్ర కవుల చరిత్రము

లైన వారి కెవ్వరికిని దొరకని బాలసరస్వతి కృతటీకాసహితాంధ్రశబ్ద చింతా మణి లభించినదనియు, తన్మూలమున నప్పకవి మొదలై న వారికథ లబద్దములయి సత్యము తేటపడినదనియు, ఆ గ్రంథమును జూచి యుండిన యెడల నేను నా కవులచరిత్రములో నట్లు వ్రాసియుండననియు, నుడువుచు బాలసరస్వతి కా గ్రంధము లభించిన మార్గమునుగూర్చి యప్పకవ్యాదులనిచెప్పిన దానికంటెను నెక్కువ యసంగతముగా నున్న కథతోఁ గూడిన యీ క్రింది యవతారిక నుదాహరించుచు నాంధ్రసాహిత్య పరిషత్పత్రిక కొక వ్యాసము వ్రాసియున్నారు.*

"ఉ. ఏమి మహాద్భుతం బది ! హరీహరి ! యెక్కడియాంధ్రశబ్ద చిం
     తామణి ఫక్కి? యొక్క_డి మతంగనగంబు ? యుగాదిసంభవుం
     డై మని చన్ననన్ననమహాకవి యెవ్వడు ? సిద్ధుఁ డెవ్వడా
     హా ! మదగణ్యపుణ్యసముదగ్రతఁ జేకుఱెగాదె యిన్నియున్.

 మ. ఇలఁ బ్రజ్ఞానిధులౌ కవు ల్మునుపు లేరే ? వారు వ్యాఖ్యాన క
     ర్తలు గానోపరె ? పెక్కువత్సరము లంతర్భూతమై యున్నయీ
     తెలుఁగువ్యాకరణంబు నా కొనఁగె ప్రీతిం డీక గావింపుమం
     చల సిద్ధుండు మదిష్టదేవత విరూపాక్షుండు నిక్కంబుగన్.

 వ. ఆంధ్రశబ్ద చింతామణిఁ దెనిఁగించెద నిది తొల్లి సకల కవితా ప్రవర్త
    కుండగు శబ్దశాసనుండు సకలహితంబుగా యధోచిత సూత్రగర్భితంబు
    లగు నార్యావృత్తంబుల బంచ పరిచ్ఛేదంబుగా సమకట్టె. నేను నా
    నేర్చుకొలఁదిఁ దత్సూత్ర విభాగంబును, దత్ప్రమేయ వివరణంబును,
    దదుదాహరణ స్వరూపంబులునునంధ్రమయ గద్యపద్యంబుల నేర్పరించి
    నా యాత్మదేవత యగు నంబాదేవి కర్పించువాఁడ."


(*మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు, శ్రీరాళ్ళపల్లి గోపాలకృష్ణ శర్మగారును అనంతపుర మండలమున సంపాదించిన బాల సరస్వతీయము 1982లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారిచేఁ బ్రకటితము)