నన్నయభట్టు
61
పాఠముతో సరిపోవనందున నుపేక్షింపఁ బడినదని వ్రాసి యున్నాడు. అంత యల్పకాలములో నిన్ని పాఠభేదము లెట్టు గలిగెనో దురూహ్యముగా నున్నది. అప్పకవి మతానుసారముగా సారంగధరుని యనుగ్రహము వలన బాలసరస్వతి కొక్క పుస్తకము మాత్రమే లభించి యతఁడు చేసిన తెలుగుఁ టీకతో నతని కది స్వప్నములో సాక్షాత్కరించిన గోపాలకృష్ణుని యనుగ్రహమువలన నొక బ్రాహ్మణునిచే లభించినది. అప్పటికిఁ బాఠ భేదములు లేవు. అంతటి యల్పకాలములో బహుపాఠ భేదములు కలుగుట కవకాశము సహితము లేదు. ఇంక నహోబల పండితుని మతానుసారముగా (పాఠ భేదాస్తు బహవోదృశ్యంతేపుస్తకద్వయేమయా ప్రాయస్సరస్వత్యాః పుస్తకం గృహ్యతే) పాఠ భేదము లనేకములు కనబడుచుండగా నందు బాలసరస్వతి పాఠమే యతనిచేఁ దఱచుగా గ్రహింపబడుచు వచ్చినది. ఈ రెండు మతములలో నప్పకవి చెప్పినట్లు సారంగధరుఁ డొక్కపాఠము నొక బాలసరస్వతి కిచ్చిన మాట నిజమో ! ఆహోబలపండితుఁడు చెప్పినట్లు పెక్కుపాఠ భేదములుండి యందు బాలసరస్వతి దొక్కటి యగుట నిజమో ! ఏది యెట్టి దయినను బాల సరస్వతినో, మఱియెవ్వరిచేతనో యాంధ్రశబ్ద చింతామణి యా కాలము నందే రచియింపఁబడుట మాత్రము నిజము. అందుఁ గనఁబడుచు వచ్చిన దోషముల నప్పుడప్పుడు వారువారు తమకుఁ దోచినట్లుగా దిద్దుచు వచ్చుట చేత నేర్పడినవే యీ పాఠ భేదము లయియుండును. 'అద్యః క్రియాసు భూతార్థద్యోతిన మాద్యగం వినా సర్వః' అను దానిలోని దోషమును గనిపెట్టి యప్పకవిదానిని'ఆద్యః క్రియాసుభూతాద్యర్ధసముద్యోతి సంవినా సర్వః"అని సంస్కరించినాఁడు అట్లే యహోబల పండితుఁడును మఱియొక దోషమును గనిపెట్టి 'హల్యధ్వరణాచార్యమతాత్" అన్న దానిని వదలివేసి యింకొక సంస్కారమును జేసినాఁడు. కలవన్న పాఠ భేదము లన్నియు నిట్టివే. ఈ పాఠ భేదములను గూర్చి యిందింత కంటె నధికముగా చర్చించుట యనావశ్యకము. ఆంధ్రశబ్ద చింతామణి నన్నయ కృతము కాదని చూపుట కింతయే చాలియుండును. ఇది యిట్లుండఁగా నీ నడుమ ననంతపురమండల పండితు లిరువురు తమకుఁ గ్రొత్తగా నన్నయభట్టీయ ముద్రాపకులు మొద