పుట:Aandhrakavula-charitramu.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

60

ఆంధ్రకవులచరిత్రము

[భా

నని భారతములోనే నన్నయభట్టారకుఁడు చెప్పకొని యున్నాడు. ఈ పద ప్రయోగమునుబట్టియే యాతని కితర కవులు వాగనుశాసనాది విశేషణములు చేర్చి యున్నారు. ఇటీవల నాంధ్రశబ్ద చింతామణిని రచియించినవారుసు "విపుల శబ్ద శాసను’ నన్న ప్రయోగము నాధార పఱచుకొనియే యది నన్నయభట్టకృతమని లోకమును మోహపెట్టి యున్నారు. 'విపులశబ్దశాసన' బిరుదము వ్యాకరణ రచనచేతనే వచ్చిన ద నెడు పక్షమున, ఆంధ్రశబ్ద చింతా మణిలోని "ఇతి శ్రీసకల భాషావాగను శాసన నన్నయభట్టు విరచితాంధ్ర శబ్ద చింతామణౌ" అను పరిచ్ఛేదాంత గద్యమునుబట్టి యతఁడు సకల భాషలకును వ్యాకరణములు చేసెనని చెప్పవలసి వచ్చుగదా ! అట్లతఁడు చేసి యుండక పోవుట స్పష్టము. అతఁడు తనకుఁగల పాండిత్య విశేషాదులను భారతములోనే తెలుపుకొని యుండుటచేతఁ దద్విరుద్ధముగా నున్న "సకల భాషావాగను శాసన" పదప్రయోగమువలననే యా పుస్తకము నన్నయభట్ట విరచితము గాక తదన్య కల్పిత మనియు, పుస్తకమున కౌత్కృష్ణ్యమును కలిగించుటకయి గ్రంధకర్త లీ విశేషణమును నన్నయభట్టునకుఁ జేర్చి రనియు, గ్రంధము నన్నయభట్ట కృతి యేయయిన పక్షమున, నిట్టి విశేషణ ముండదనియు, దీనినిబట్టిఁ సులభముగాఁ దెలిసికొనవచ్చును. ఆంధ్రశబ్ధ చింతామణి నన్నయభట్టవిరచిత మని తమ స్వప్నదర్శన వృత్తాంతమునుబట్టి మొట్టమొదటఁ జెప్పినవారుకూడ నేతద్గ్రంథ రచనము నొక్క సారంగధరుఁడు తక్క నన్యు లెవ్వరు నెఱుఁగ రనియు, దాని నతఁ డొక్క బాల సరస్వతి కిచ్చెననియునే కదా చెప్పచున్నారు ! వారి మాటలను విశ్వసించినను, నన్నయభ ట్టాంధ్రశబ్ద చింతామణిని రచించిన ట్లాతని తరువాతకవుల కెవ్వరికిని దెలిసి యుండనట్టు స్పష్టమగుచున్నది. ఇది యిట్లుండగా నప్పకవికిఁ తరువాత నాంధ్రశబ్ద చింతామణికి సంస్కృత వ్యాఖ్య చేసిన యహోబల పండితుఁడు "నుమ్చోతో " ఇత్యాది సూత్రమునందుఁ గల "హల్య ధర్వణాచార్యమతాత్" అను భాగమును వదలివేసి (హల్యధర్వణ స్యమత ఇత్యప్పకవి పుస్తక పారస్తు నైతత్పార సామంజస్యం లభ్యత ఇత్యుపేక్షిత:) హల్లథర్వణ మతప్రకారముగా లభించిన దన్న యప్పకవి పాఠ మీ