ఈ పుట ఆమోదించబడ్డది
1]
నన్నయభట్టు
59
ఉ. వేయి విధంబులందుఁ బదివేవురు పెద్దలు సుప్రబంధముల్
పాయక చెప్పి రట్ల రసబంధురభావభవాభిరామ ధౌ
రేయులు శబ్దశాసనవరేణ్యులు నాఁగఁ బ్రశస్తి కెక్కిరే
యేయెడ నన్నపార్యుగతి నిద్ధర నట్టి మహాత్ముఁ గొల్చెదన్.
(ఆశ్వా. 1-12)
ఈ కవి నన్నయభట్టును స్తుతించిన పయిపద్యములో సుప్రబంధములుచేసిన వారు పదివేవు రుండఁగా వారెవ్వరును గాక యతఁ డొక్కcడే శబ్దశాసనవరేణ్యుc డయ్యెనని వర్ణిం చుటచేతఁ గొందఱనుకొను నట్లాతనికి శబ్దశాసన బిరుదము వ్యాకరణ రచనచేత రాలేదనియు, సలక్షణమైన ప్రౌఢ కవిత్వ రచనచేతనే వచ్చినదనియు స్పష్టపడుచున్నది *[1] తాను విపుల శబ్దశాసనుఁడ
- ↑ (* శ్రీనిడుదవోలు - వేంకటరావుగారి "తెనుఁగు కవుల చరిత్రలో క్రిందిజి యాశయమును వెల్లడించు చున్నారు నన్నయ భారతమునఁ దాను శబ్దశాసనుఁడ నని చెప్పుకొనుటచే, నాతఁడు వ్యాకరణ రచయిత యని చెప్పవీలులేదు. శబ్దశాసన బిరుదము నన్నయకు లేదు. అది తర్వాతి వారిచే నాతని కారోపింపఁ బడియున్నది. నన్నయ వ్యాకరణమును రచించినచో - అనగా 'అనుశాసనము' చేసినచో శబ్దాను శాసనుడు కావలయును. శాసనుఁడు, అనుశాసనుcడు అనునవి వేఱువేఱర్థములు కలవి. శబ్దశాసనుఁడనునది బిరుదమని నన్నయ చెప్పకొనలేదు, ఇది బిరుదైనచో ' జపహోమ తత్పరుఁడు, సంహితాభ్యాసుఁడు, నానాపురాణ విజ్ఞాననిరతుండు' మున్నగు నవియు నతని బిరుదులే యని యనవలసి వచ్చును. నన్నయకు ' శబ్దశాసన ' బిరుద మున్నట్లు తిక్కన, ఎఱ్ఱాప్రెగ్గడ, మడికి సింగన, పోతన - మున్నగువారు చెప్పలేదు. వసుచరిత్రను రచించిన రామరాజభూషణుఁడు 'మహిమున్ వాగానుశాసనుండు సృజి యింపన్' అని 'శబ్దశాసనండు' అను దానిని 'వాగనుశాసనుఁడు' గా మార్చెను. అప్పటినుండియు నిదియే నన్నయ బిరుదుగా వాడుకలోనికి వచ్చెను. నిజముగా 'శబ్ద శాసనుఁడు బిరుదైనచో దానికి బర్యాయపదముండుటకు వీలు లేదు. బిరుద పదవులు పర్యాయపదా సహిష్ణువులగుట భాషా సంప్రదాయాభిజ్ఞులకు గ్రొత్త కాదు. పర్యాయములను వాడవచ్చుచున్నచో 'శంభు దాసు'ను 'శంకరదాసు'గను, ఉభయ కవిమిత్రుని " ద్విభాషా కవిమిత్రుఁడనియు నీరీతిగాఁ జెప్పవలసి వచ్చుచుండును కాన 'శబ్దానుశా సనుఁడు ' బిరుదు కాదనియే చెప్పవలెను )