పుట:Aandhrakavula-charitramu.pdf/85

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

58

ఆంధ్ర కవుల చరిత్రము

ఇవి యన్నియు నాంధ్రశబ్దచింతామణి నన్నయకృతము కాదని యూహించుటకుఁ దోడుపడుచున్నవి. బాలసరస్వతికిఁ బూర్వము నందుండిన కవులు కొందఱు నన్నయభట్టారకుని "శబ్దశాసన" పదముతోను తదర్థబోధకము లయిన "వాగనుశాస" నాది పదములతోను వ్యవహరించుచు వచ్చినందున నాంధ్రశబ్ద చింతామణియొక్క యునికి వారికిఁ దెలియునని కొందఱు భ్రమ పడుచున్నారు. వ్యాకరణము జేయుటచే నీ బిరుదాతనికి వచ్చినట్లు దేని వలనను గనఁబడదు. భాషననుశాసించి సలక్షణ మయిన యాంధ్రకవిత్వము నకు దారి చూపుటచేతనే యీ బిరుదము నతఁడు వహించి యుండవచ్చును. జక్కనకవి తన విక్రమార్కచరిత్రమునందు నన్నయభట్టు నీ క్రింది పద్యముతో స్తుతించి యున్నాఁడు - __________________________________________________________________________ వాక్యాంత మయ్యెనేవి సంధి వైవక్షిక మని నన్నయాభిప్రాయము [చూ. విషయము 48]

'నన్నయ భారత భాగములోని ప్రయోగములకు సరిగా నాంధ్ర భాషా భూషణము, కావ్యాలంకార చూడామణి మున్నగు ప్రాచీన లక్షణ గ్రంథములలో 'ఎడ్యెడు' ప్రత్యయాంత రూపములును, ఎదగాగను యుక్తరూపములును వర్తమానార్థకములనియు, దుగాగమ యుక్తరూపములు భవిష్యదర్ధము లనియు జెప్పఁబడియున్నట్లును, నాంధ్రశబ్ద చింతామణిలో నట్లు ప్రాచీన పద్ధతిని చెప్పఁబడక 'ఉన్నాను బంధ' యుక్తరూపములు వర్తమానార్థకములనియు, 'కలానుబంధ' యుక్తరూపములు భవిష్యదర్ధకములనియు, నవీన పద్ధతిని జెప్పఁబడినట్లును. నక్కారణమున నాంధ్రశబ్ద చింతామణి ప్రాచీన మనుటకు వలను పడనట్లును నాంధ్రకవుల చరిత్రమున వ్రాయబడియున్నది.

'ఆంధ్ర భాషా భూషణ, కావ్యాలంకార చూడామణికర్తలు భారతమునేగాక యా కాలము నిందలి యాంధ్ర వాఙ్మయమునే బాగుగఁ బరిశీలింపక యే క్రియారూప ముల కాలముల నుపదేశించిరనుట సాహసము కాదు. వీరేశలింగము పంతులుగారు స్వవాదోపయుక్తములగు ప్రయోగములను మాత్రమే భారతము నుండి చూపి బాధక ప్రయోగములను జూపకుండుట యుక్తము కాదు. పురాతనాధునాతన వాఙ్మయములో నెచ్చటను దుగాగమ యుక్తరూపములకుఁగాని, ఎదగాను యుక్తరూపములకు గాని కాలనియమ మగపడదు ద్వివిథరూపములను వర్తమాన, భవిష్యత్కారములు రెండింటి యందును నన్నయభట్టారకుఁడే వాడి యున్నాఁడు. ఇంకను దుగాగమ యుక్తరూప ములకు భూత కాలమునందును నరుదుగ వాడుక కలదు [విష.59, 60]