ఆంధ్ర కవుల చరిత్రము
పురుషంబునకు నెదనెదములును గ్రమంబున నాదేశంబు లయ్యెఁ దన్నిరూపణం బెఱింగింతు.
క. అరిగెడి నరిగెత రనఁగా
నరిగెద వరిగెద రనంగ నధిపతిపురికై
యరిగెద నరిగెద మనఁగాఁ
బరువడి నిది వర్గమానఫణితార్థ మగున్.
వ. ప్రథమపురుషంబునకు భవిష్యదర్థంబునందు నేకవచన బహువచనంబులకు నుదురులును మధ్యమపురుషంబునకు దుదువుదురులును వరుస నాదేశంబులయ్యెఁ దన్నిరూపణంబు లెట్లనిన-
క. చేయును జేయుదు రనఁగాఁ
జేయుదు చేయుదువు మీరు చేయుదు రనఁగాఁ
జేయుదుఁ జేయుదు మనఁగాఁ
నాయనముగ నిది భవిష్యదర్థం బయ్యెన్.
[నవమోల్లాసము - పరిషత్ప్రతి పుటలు 64, 65]
అని చెప్పియున్నాఁడు. ఇది యిట్లుండఁగా నాంధ్రశబ్ద చింతామణియందు
"వసతి రనుబంధక స్స్యాద్యత్ర లడర్థో వివక్షిత స్త్రత్ర"
అని క్రియాపదంబునకు వర్తమానార్థము వివక్షిత మగునప్పుడు 'వసా ధాత్వర్థమైన "యున్న" యనుబంధక మగు ననియు
"అస్తి రనుబంధన స్స్యాద్యత్ర లృడర్థో వివక్షితోధాతోః?
అని క్రియాపదంబునకు భవిష్యదర్థము వివక్షిత మగునప్పుడు 'అస ' ధాత్వర్థమైన "కల" యనుబంధక మగుననియు చెప్పఁబడియున్నవి. అనుబంధము లేక వర్తమాన భవిషయదర్థక రూపము లున్నట్టు చెప్పనట్టియు భవిష్యదర్థ