52
ఆంధ్ర కవుల చరిత్రము
[భా
ఇది భారతప్రయోగముల కెల్ల విరుద్దమయినదని యెల్లవారికిని దెలియును. కాఁబట్టి యీ రెండు నూత్రములును నన్నయభట్ట వయి యుండవు.
"నిత్య మను త్తమ పురుష క్రియా స్వితః"
ఆనెడి యూ యాంధ్రశబ్ద చింతామణి సూత్రము ప్రధమ మధ్యమ పురుష క్రియాపదములయం దికారమున కచ్చు పర మగునప్పడు సంధి నిత్యమని చెప్పుచున్నధి. ప్రధమ పురుషక్రియాపదముల యికారమునకు సంధి వైకల్పిక మయినట్లు భారతమునందలి నన్నయభట్టారకుని ప్రయోగములే చెప్పచున్నవి. ఆ ప్రయోగములకు విరుద్దముగా నున్నయిది నన్నయభట్టు సూత్రము కానేరదు. అరణ్యపర్వములోని యూ క్రింది పద్యభాగమును జూడుఁడు-
"అంతఁ గొంద అధిక హాస్యంబు చేసిరి
యడవి నేమి రోసె దనిరి కొంద
ఱవ్వ నీవు వేల్ప వౌ దని కొందఱు
మోడ్పుఁగేలితోడ మ్రొక్కిరంత"
సమస్తభాషల యందును గ్రియలలో ననుబంధ మక్కఱలేకయే వర్తమానార్ధకమును దెలిపెడి రూప ముండును. "పలికెడు' అనునది వర్తమానార్ధక రూపకముగాను, 'పలుకును" అనునది భవిష్యదర్ధక రూపము గాను, ఉన్నట్టు భారతాది గ్రంధములలోని ప్రయోగములు తెలుపుచున్నవి.
క. అఱపొఱడు కుఱచచేతులు
నొఱవ శరీరంబ గలిగి యొరులకుఁ జూడం
గొఱ గాకుండియు మన్మథు
నొఱపులఁ బడియెడు నితండు యువతీ ప్రియుఁడై
[ఆరణ్యపర్వము, 2 - 134 ]
క. నాయొద్ద నుండు దేనియుc
జేయు రథాశ్వముల గతులు చిత్రంబులుగా