47
నన్నయభట్టు
ఆంధ్రశబ్దచింతామణి నన్నయభట్టారకవిరచితము కా దనుటకుఁ గల హేతువులనుగూర్చి యిచ్చట గొంత విమర్శింతము. అప్పకవీయము పంచమా శ్వాసమునందు శబ్దానుశాసన మూలసూత్ర మని “ను మ్చోతో హల్యధ్వరణాచార్యమతాత్' అని యొక సూత్ర ముదాహరింపఁబడి యున్నది. ఇది నిజముగా నన్నయభట్టీయసూత్రమే యయినయెడల, అధర్వణాచార్యుఁడు నన్నయభట్టునకుఁ బూర్వకాలికుఁ డనియే చెప్పవలెను. అదియే నిజ మయినపక్షమున, 'ఆప్రయుక్త త్వదోష స్తున విరుద్ధా హరే ర్మతే" యనివి యధర్వణకారికలలోఁ జెప్పఁబడి యుండుటచేత హరికారికలును నన్నయ భట్టియమునకుఁ బూర్వపువే యయి యుండవలెను. ఇప్పడు శిష్టు కృష్ణమూర్తి గారిచేత వ్యాఖ్యానము చేయఁబడి చిన్నయసూరిగారి బాలవ్యాకరణములోని సర్వాంశములను గలిగి యున్న హరికారికలే * నిజమయిన హరికారికలయి యీ హరికారికలును అధర్వణకారికలును గూడ నన్నయభట్టీయ వ్యాకరణమునకుఁ బూర్వపు వయినవశమున నన్నయభట్టీయమున కంత ప్రసిద్దివచ్చుటకుఁ గాని విశేషాంశములతో నిండియున్న యటువంటి యుత్తమ కారికావళు లుండగా నల్పాంశములను మాత్రమే కలిగి వాని ముందర నిష్ప్రయోజకమని చెప్పఁదగిన యాంధ్రశబ్దచింతామణి నన్నయభట్టు రచించుటకుఁ గాని హేతువుండదు. శబ్దానుశాసన మూలసూత్రమవి యప్పకవీయములోఁ బేర్కొనబడిన, పయి సూత్రమును, మరి కొన్ని సూత్రములను ప్రత్యేకముగా నున్న యిప్పటి యాంధ్రశబ్దచింతామణియందుఁ గానఁబడకపోవుటచేత నప్పకవి యుదాహరించిన యాసూత్రములు ప్రక్షిప్తములని కొందఱు చెప్పుచున్నారు. ఈ సూత్రముమాత్రమే కాక గ్రంధమంతయి ప్రక్షిప్తమగుట మరింత యుక్తముగా నుండును. ఈ ప్రకారముగానే శిష్టుకృష్ణమూర్తిగారును బాలవ్యాకరణము రచియింపబడిన తరువారనే హరికారికలని పేరుపెట్టి తానాగ్రంధమును రచించి **వ్యాఖ్యానము __________________________________________________________________________ [*(ఈ హరికారికావళి శిష్టుకృష్ణ మూర్తిశాస్త్రి రచన. ఆది యాంధ్రశబ్దచింతామణికి వివరణమని, జ్యోత్స్న్య నామాంతరమని తెలియనగును ) (** శిష్ట కృష్ణమూర్తిశాస్త్రి గారు కారికలను రచించి రేగాని, వానికి వ్యాఖ్యానము చేయలేదు.)]