పుట:Aandhrakavula-charitramu.pdf/738

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

711

కే త న మం త్రి

              యనుచుఁ గొలని యిట్టి యతిశీతలత్వంబుఁ
              బరపుఁ బెంపుఁ దీపుఁ బావనతయుఁ
              గడుముదంబుఁ బెంపఁగా వాజి బడివాగె
              త్రాట దిగిచికొనుచుఁ దరియఁ జొచ్చె ?[1]

ఈ యుదాహృత గ్రంధములోనే కేతన ప్రెగడ కువలయాశ్వచరిత్రము లోని దని యీ పద్య ముదాహరిం పబడినది

          ఉ. కోటతనర్చుఁ జూడ్కుల కగోచర మయ్యెను దేరిమీఁద బ
              ల్మాటున నేగుచోటఁ దగులం బడమిన్ రవిమండలంబు నీ
              పాటిదయన్ తలంపునకుఁ బట్టగు చున్నది. గాక దీనికిం
              బాటి యనంగ గుజ్జనఁగఁ బట్టవె యయ్యుదయాస్తశైలముల్. [2]

  1. [మూలఘటిక కేతన వ్రాసిన 'దశకుమార చరిత్రము' నుబట్టి, యీ కేతన తిక్కన తాతయగు మంత్రి భాస్కరుని పెద్దకుమారుఁడనియు, తిక్కనకుఁ బెదతండ్రి యనియుఁ దెలియుచున్నది. భాస్కరుని కేతన యే కొట్టరువు కేతన. ఇతని మనుమడు వేఱొక కేతన కలఁడు, అతఁడు కవిగా ప్రసిద్ధిలేదు]
  2. [కువలయాశ్వ చరిత్రమును రచించిన కేతన తిక్కన పెదతండ్రికంటెను, దశకుమార చరిత్ర కర్త కంటెను భిన్నుఁడు. ఇతఁడు నండురి కేతనయో, వేఱొకడో యయి యుండవచ్చునని 'ఆంధ్రకవి తరంగిణి' కర్త యభిప్రాయము. చూ.రెండవ సంపుటము పుట 134)]

    [కాదంబరీ కావ్యరచన క్రీ.శ. 1260 ప్రాంతమునకు ముందుగానే జరిగియుండునని 'తెనుఁగు కవుల చరిత్ర’ లో గలదు. (పుట 286)]