పుట:Aandhrakavula-charitramu.pdf/728

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

701

ఫ ణి భ ట్టు

కవికాలనిర్ణయమునకు గ్రంధములోని యీ కవిస్తుతిపద్యమే ముఖ్యాధారమని చెప్పుచున్నారు.

      సీ ప్రథమకవిత్వహేవాకిని వాల్మీకి
                      భారతాదికథావిభాసు వ్యాసుఁ
         గావ్యత్రయీ ప్రవికాసు గాళిదాసు
                      హరికథాదళితమహాఘు మాఘు
         వివిధ ప్రబంధవాగ్విశ్రాణు బాణువి
                      సారార్థవిజ్ఞానధీరుఁ జోరు
         నఖిలవిద్యామనోహారు మయూరుని
                      సన్నుతకవివర్యు నన్న పార్యుఁ

         దిక్కయజ్వాదిపూర్వ ప్రధితకవుల ను
         తించి యేతత్కవీంద్రుల నెంచి భావి
         కావ్యకరుల బహం క్రియాకలన నుంచి
         పని చేసెదనొక కృతి పుణ్యనియతి

దీని నాధారము చేసికొని కవి నన్నయతిక్కనలను మాత్రమే స్తుతించి నందున మిక్కిలి (ప్రాచీనకవి యనియు, తిక్కయజ్వాదిపూర్వ ప్రధిత కవులనుటచేతఁ దిక్కనాదులకుఁ దరువాతఁ గొంతకాలమున కుండెనవియు చెప్పుదురు. కర్తృకాలమును నిర్ణయించుట కిట్టీవే యాధారములైనయెడల తమ పుస్తకములలోఁ గవిస్తుతులను చేయని వారందఱును నన్నయాదులకే పూర్వులని చెప్పవలసి వచ్చును. [1] ఫణిభట్టారకుని కవిత్వము

  1. [పరతత్త్వ రసాయనమున బమ్మెర పోతురాజుయొక్క పోలికలు కానవచ్చు చుండుట చే ఫణిభట్టు పదు నేనవ శతాబ్ది చివఱనుండి యుండవచ్చునని, దాని ముద్రితప్రతి పీఠిక లో శ్రీపాద లక్శీపతి శాస్త్రిగారు తెలిపియున్నారు ]