700
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
పయి పద్యములయందీశ్వరాన్వయమున నాపస్తంభసూత్రుఁడును గార్గ్యసగోత్రుఁడును నయిన ఫణిభట్టు పుట్టినట్టును, తద్వంశమున జనించిన యీశ్వరభట్టునకును తత్పత్నియైన రామమ్మకును తానును తనయన్నలైన కొండుభట్టును, నారాయణభట్టును జనన మొందినట్టును కవియైన ఫణిభట్టు చెప్పుకొనెను. పుస్తకమునం దాశ్వాసాంతగద్య మిట్లున్నది.
“ఇది శ్రీమదద్వయ బ్రహ్మవిద్యారహస్యావబోధననిపుణతాధురీణ సాక్షాన్మహేశ్వర
శ్రీసదానందసద్గురురాయపట్టభద్రకరుణాతరంగిణీ రంగత్తుంగాభంగతరంగహోలాందోళిత
హంసడింభాయమానేశ్వరా న్వయసంభూతేశ్వరభట్టతనూజ ఫణిభట్టప్రణీతంబైన
పరతత్త్వరసాయనంబను మహాకావ్యంటు నందు ... పంచమాశ్వాసము"
కృతికర్తవంశానువర్ణనమునుబట్టి గాని కృతిభర్తవర్ణనమునుబట్టి గాని కవికాలమును నిర్ణయించుకు నా కాధారమేదియుఁ గానరాలేదు. అందఱు నీతఁడు పూర్వకవి యనుచున్నారు గనుక కాఁ డనుటకు దగినకారణ మేదియుఁ గఁనబడనందున నేనును నీతనిఁ బూర్వకవిగానే పరిగణించెదను. శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు ముద్రింపించి ప్రకటించిన పరతత్త్వరసాయనము యొక్క పీఠికలో వారు కవికాలనిర్ణయమును జేసి యుందురన్న భ్రమతోనేనా పుస్తకమును సంపాదించుటకు బహు ప్రయత్నములు చేసితిని గాని యింతవఱకునునా కృషి సఫలముకాలేదు.[1]
- ↑ [రామకృష్ణకవిగారు 1910 వ సంవత్సరము ఏప్రియల్ నెలలో ప్రకటించిన నీతిశాస్త్రముక్తావళియొక్క యాచ్ఛాదనపత్రము పైని దీని వెల మూడణాలయినట్టు ప్రచురించి;1912 వ సంవత్సరము జూన్ నెలలో ప్రకటించిన శ్రీరంగ మహత్వము తుది పుస్తక ప్రకటనములో పరతత్త్వరసాయనము యొక్క వెలను మూడణాల నుండి పండ్రెడణాలకు పెంపు చేసిరి, తరువాత 1914 వ సంవత్సరము ఆగష్టు నెలలో ప్రకటించిన నన్నెచోడుని కుమారసంభవము ద్వితీయ భాగము యొక్క యాచ్ఛాదనపత్రము పైని దాని వెలపండ్రెడణాల నట్టే యుంచిరి. పరతత్త్వరసాయన సంపాదకులు గాని, ముద్రాపకులు గాని, ముద్రిత గ్రంథమునుగొని తమ యొద్దనుంచుకొన్న వారుగాని నా కొక ప్రతిని వీ. పీ.గా బంపి నా కృతజ్ఞతకు బాత్రు లగుదురు అగుదురు గాక !]