697
వె న్నె ల కం టి సూ ర న్న
ఉ. అందని పంటికేమిటికి నఱ్ఱు నిగిడ్చెదు ? విష్ణుఁడున్న యా
కందువ చందమా మగుటకల్ వినుమి పని కట్టి పెట్టి నా
డెందములోని యుమ్మలిక డిందుపడం జనుదెమ్ము పోద మిం
పొంద సమ స్తభోముగలఁ బొందెడు తండ్రికి వేడ్కచేయఁగన్ ఆ.2.
చ. ఎనిమిది మాసముల్ రవి మహీవలయంబునఁ గల్గుతోయమున్
తన కిరణంబులందుఁ గొని తక్కిన మాసచతుష్టయంబునన్
ఘనతరవృష్టిరూపములుగా జలముల్గురియింప లోక మె
ల్లను బరితృప్తిఁ బొందును జలంబును సన్నముఁ గల్గి పెంపుతోన్.
మ. పరకాంత న్మదిలోన నైనఁ దలఁపం బాపంబు దుఖంబునున్
బరివాదంబును నొంది ఘోరనరకప్రాప్తవ్యథల్ పెక్కు వ
త్సరముల్ చెందుదు, రట్టి యన్యవనితా సంభోగదోషంబు దా
నరనాధో త్తమ ! యింత యంత యని యెన్నన్వచ్చునే యేరికిన్;
ఉ. కారుమెఱుంగులో మెలపు గైకొన నేర్చిన పైఁడిబొమ్మలో
మారునిదీపములో కలికిమాటలచంద్రికలో చెలంగుశృం
గారరసాధిదేవతలో కమ్మని క్రొవ్విరితీగెలో యనన్
వారిజపత్రలోచనలు వచ్చిరి మోహవిలాసమూర్తులై . ఆ.5.
ఉ. కాయజుచేత గాసిపడి గౌతముభార్యకుఁ బోయి కొక్కోరో
కో యని కోడికూఁత లొగిఁ గూసి మునీంద్రు చేత శప్తుఁడై,
పోయిన వజ్రి మేటిదొరపోలె బృహస్పతిపత్ని కై ననున్
రోయఁగ నాడ నేల తన రోఁతలు లోకమువారు నవ్వఁగన్ ఆ.6.
ఉ. ఈ యవివేకవుంబనుల కెట్లు తొడంగితి వొప్ప దింత య
న్యాయము గాలిపోయెడు దురాగతముల్ విని పాపబుద్ధి న
య్యో ! యిటువంటి ముద్దులసహోదరి ముందల పట్టి యీడ్చి కో
కో యని కూయఁగాఁ గుతిక కోసిన లోకమువారు తిట్టరే? ఆ. 7
మ. మదిరాపానముచేత నొక్కసతి తా మత్తిల్లి వేరొక్కతెన్
హృదయేశుండని కౌగిలించె; నది దానం ద్రాణనాథు డటం
చొదవన్ గమ్మని మోవి యిచ్చె, నటు లన్యోన్య ప్రవృత్తక్రియల్
ముదిత ల్కొందఱు చూచి నవ్వి సరసంబు ల్పల్కి రత్యంతమున్