686
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
గీ. అట్టి గుణశాలి తమ్మరాయనికుమార
వీరబసపక్షమాచక్రవిభునిచేత
మన్ననలు గాంచి మించిన మహితుఁ డితఁడు
మనుజమాత్రుండె గంగయామాత్య వరుఁడు.
అని చెప్పఁబడినది. 1480 మొదలు 1490 వ సంవత్సరమువఱకు నుండిన యనంతయామాత్యుని కాప్త ప్రభువైన తమ్మయ బసవభూపాలుఁడు 1470-80 సంవత్సర ప్రాంతములయందు దప్పక యుండినవాఁడు. అందుచేత తమ్మయ బసవభూపాలునికి పంచతంత్రము నంకితమొనర్చిన దూబగుంట నారాయణకవి 1470-80 వ సంవత్సర ప్రాంతములయందుండె ననుటకు సందేహములేదు. నారాయణకవి దూబగుంటకరణము: [1] ఆపస్తంభసూత్రుఁడు; మైత్రావరుణ గోత్రుఁడు, బ్రహ్మయామాత్యు పుత్రుఁడు; ఆఱువేలనియోగి కులపవిత్రుడు, ఈతని పంచతంత్రము వేంకటనాథుని పంచతంత్రమంతటీ రసపుష్టి కలది కాకపోయినను, సలక్షణమయ చక్కని లోకోక్తులతోను మృదువులయిన తెలుఁగుపదములతోను నిండి తేనెలొలుకునదిగా నున్నది. ఈతని పంచతంత్రమునుండి కొన్ని పద్యముల నిందుదాహరించు చున్నాను
చ. శరనిధి దాఁట నావయును నంతమసం బడఁగింప దీపమున్
వరకరిశిక్ష కంకుశము వాయువుఁ గూర్పఁగఁ దాళవృంతమున్
వెరవునఁ జేసె బ్రహ్మపదివేలవిధంబుల మూర్ఖచిత్తవి
స్ఫురణ మడంపలేక తలపోయుచు నిప్పుడు నున్నవాఁ డొగిన్
మిత్రభేదము.
- ↑ [నారాయణకవి యింటిపేరు దూబగుంటవారని చెప్పట కవకాశము లేదనియు,'హరిహరభక్తు-’ నను పద్యమునుబట్టి 'వాచకాభరణము'గాని, 'ప్రబంధ వాచకాభరణము' అని కాని యింటిపేరై యుం డవచ్చునని, ఒకవేళ 'బ్రబంధ వాచకాభరణము' కవివిశేషణమైనఁ గావచ్చునని, 'ఆంధ్రకవి తరంగిణి' (సం. 6 పుట 86)]