Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/707

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

680

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

       క. బుధవినుత ! సాళ్వనరసిం
           గధరాధవదండనాధ ! కాంతాపంచా
           యుధ ! సుమన స్తరుసుమనో
           మధురసమధురిమధురీణమంజులఫణితీ ఆ 9

        క. ధరణినుత దేవకీపుర
           వరనిలయశ్రీగిరీశవనసంపన్నే
           శ్వరవిభుతనయా ! సాళువ
           నరసింహనృపాలదండనాయకతిలకా ! ఆ. 11

ఈ యిరువురు కవులును గ్రంధరచన చేసినట్లు చెప్పఁబడియున్నను వీరిలో మలయమారుతకవి యనఁబడెడు ఘంట సింగన్న యే ప్రసిద్ధుడైన మంచి కవి యైనట్టు గ్రంథాంతరములవలనఁ దెలియవచ్చుచున్నది. ఈ సింగన్న తండ్రి పేరు నాగయ్య; తల్లి పేరమ్మలాంబ; పారిజాతాపహరణమును రచియించిన నందితిమ్మకవి యీ మలయమారుతకవికి మేనల్లుఁడు. నంది మల్లయతండ్రి పేరు సింగన్న. తల్లి పేరు పోతమాంబ సాధారణముగా ముక్కుతిమ్మన్న యనఁబడెడు నందితిమ్మకవి యీ మల్లయకవికి మనుమఁడని చెప్పుదురు. కాని పారిజాతాపహరణమునందు కవి తన వంశమును జెప్పుచో నీ క్రింది పద్యమునందీ సంగతిచెప్పి యుండలేదు.

       సీ. కౌశికగోత్రవిఖ్యాతుఁ డాపస్తంభ
                   సూత్రుఁడా ర్వేలపవిత్రకులుఁడు
           నంది సింగామాత్యునకును దిమ్మంబకుఁ
                   దనయుండు సకలవిద్యావివేక
           చతురుండు మలయమారుతకవీంద్రునకు మే
                   నల్లుఁడు కృష్ణరాయక్షితీశ
           కరుణాసమాలబ్ధఘనచతురంతయా
                   నమహాగ్రహారసన్మానయుతుఁడు

           తిమ్మయార్యుండు శివపరాధీనమతి
           యఘోరశివగురుశిష్యుండు పారిజాత