679
నం ది మ ల్ల య్య , ఘం ట సిం గ య్య
1503-వ సంవత్సరమువఱకే రాజ్యపాలనము చేసెననియు, తండ్రీకొడుకుల పేరు లోక్కటియే యగుటచేత శాసనపరిశోధకు లిద్దఱు నొక్కరే యని భ్రమపడిరనియు, కొందఱు చెప్పుచున్నారు. సత్య మిదే. కృష్ణ దేవరాయలు జనకుని యనంతరమునఁ గాక యగ్రజుఁ డైన వీరనరసింహరాయని యనంతరమునే రాజ్యమునకు వచ్చినట్లు మనుచరిత్రలోని యీ క్రింది పద్యములు తెలుపుచున్నవి. .
క. వీరనృసింహుడు నిజభుజ
దారుణకరవాలపరుషధారాహతవీ
రారి యగుచు నేకాతప
వారణముగ నేలె ధర నవారణమహిమన్
క. ఆ విభుననంతరంబ ధ
రావలయముఁ దాల్చెఁ గృష్ణ రాయఁడు చిన్నా
దేవియు శుభమతి తిరుమల
దేవియునుం దనకుఁ గూర్చుదేవేరులుగన్.
కాబట్టి నరసింహదేవరాయలకాలములో నున్న యీ కవులు హూణశకము 1480 వ సంవత్సరమునకును 1485-వ సంవత్సరమునకును మధ్య కాలమునందు వరాహపురాణమును రచియించి యున్నారు. ప్రబోధచంద్రోదయము నంతకుముందే 1470-75 ప్రాంతములందు రచించిరి. వరాహ పురాణము కృతి నందు నాఁటి కింకను నరసింహరాయఁడు సాళువ గుండ నరసింహరాయని దండనాధుఁడుగానే యుండినట్లు కృతినాయకుని సంబోధించిక వరాహపురాణములోని యీ క్రింది యాశ్వాసాంత పద్యములు తెలుపు చున్నవి.
క. తుళ్వకులజలధికల్పక
సాళ్వశ్రీనారసింహజనపాలస్స
ర్థాళ్వీబకంఠీరవ ! మణి
గాల్వతులాకోటిరుచివికస్వరచరణా !