678
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
శాసనములలో సాళువ వంశ బిరుదములు తాను ధరించుటయు, దానే రాజునని ప్రకటింప యత్ని చుటయుఁ జూడ నరస నాయకుని రాజ్యకాంక్షయు, స్వాతంత్రాభిలాషయు స్పష్టమగును కానీ లోకాపవాదమునకు భయపడియో, తన ప్రభువున కవసాన కాలమున, చేసిన వాగ్దానము నిలుపుకొన వలయు ననియో, నరసింగరాయల కుమారునిఁ దాను జీవించి యున్నంత కాలము కర్ణాట రాజ్యాధిపతిగా నంగీకరించెనను మాట మాత్రము యథార్ధము. ('ఆంధ్రకవి తరంగిణి' సం. 6 పుటలు 123, 124)
వరాహపురాణమును కృతినందిన నరసింహరాయని కాలము మనకుఁ దెలియును గనుక, ఇంచుమించుగా నీ కవుల కాలమును దెలియును. కృష్ణదేవరాయల తండ్రియైన నరసింహ దేవరాయలు క్రీస్తుశకము 1487వ సంవత్సరము మొదలుకొని 1508 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసినట్లు శిలాశాసనాదులవలనఁ దెలియవచ్చుచున్నది. కంచిలో నున్న దేవాలయములలో నొకదానిమీఁద శాలివాహనశకము 1409వ సంవత్సరమునందనఁగా హూణశకము 1483 వ సంవత్సరమునందు నరసింహ దేవరాయలు భూదానము చేసినట్లొక శిలాశాసనమువలనఁ దేటపడుచున్నది. ఇంతకు పూర్వమునం దీతని పేరు శిలాశాసనాదులలో నెక్కడను ఉదాహరింపఁబడి యున్నట్లు కానఁబడదు. అందుచేత నితఁడా సంవత్సరమునందే రాజ్యమునకు వచ్చినట్లూహింపఁబడుచున్నది. అనంతపురమండలములో పెన్నేటి యొడ్డున నున్న రామపురమునందలి రామేశ్వరస్వామియాలయపు గోడ మీద నరసింహదేవరాయలు శాలివాహనశకము 1419 –వ సంవత్సరమునకు సరియైన క్రీస్తు శకము 1497వ సంవత్సరమునందు రాజ్యము చేయుచుండినట్టు శిలాదానశాసన మొక్కటియున్నది. ఈ ప్రకారముగా నీతనీదానశాసనములు 1508-వ సంవత్సరమువఱకును గానఁబడుచున్నవి. ఆ మరుసటి సంవత్సరమునందు కృష్ణదేవరాయలరాజ్య మారంభమైనది. ఈ నరసింహరాయని యనంతరమున నాతనిజ్యేష్ఠ పుత్రుఁడు వీరనరసింహరాయఁ డైదు సంవత్సరములు రాజ్యముచేసి 1508-వ సంవత్సరమునందు మృతి నొందెననియు, అందుచేత కృష్ణదేవరాయల తండ్రి నరసింహరాయలు