677
నం ది మ ల్ల య్య , ఘం ట సిం గ య్య
పైని జెప్పఁబడిన తిమ్మయయీశ్వరరాజు సాళ్వగుండ నరసింహజునకు సేనానాయకుఁ డగుటయేకాక దాయాదుఁడు కూడ నయి యుండుటచేత నుభయుల యనంతరమును నీశ్వరరాజుపుత్రుఁడును, సాళ్వగుండ నృసింహ రాయని యప్పటి సేనాధిపతియు నైన బలవంతుఁడగు తుళువ నరసింహ రాయఁడు సంతానహీనుఁడయి కాలధర్మము నొందిన తన ప్రభువుయొక్క రాజ్యభారమును వహించినట్టు తోఁచుచున్నది. [సాళువ, తుళువవంశములు వేర్వేఱు వంశములనియు, సాళువ వంశీయులు చంద్రవంశ క్షత్రియులు, తుళువ వంశీయులు శూద్రులనియును 'ఆంధ్రకవి తరంగిణి' కారుల యభిప్రాయము (సం. 6 పుట 12)]
సాళువ నరసింహరాయలు సంతానహీనుఁడయి కాలధర్మము నొందలేదనియు ఆతని కిద్దఱో, ముగ్గురో కుమారు లుండిరనియుఁ గొంద ఱభిప్రాయపడుచున్నారు. ఈ సాళువ నరసింగరాయల కిరువురు కుమారులనీయు, వారి రువురు యుక్తవయసు రానివా రగుటచే నరసింహరాయలు తన యవసాన కాలమున వారిని తన దండాధిపతియు సమర్దుఁడునగు తుళువ నరసనాయకున కప్పగించి వీరిని జాగ్రతగఁ గాపాడి వారికి యుక్తవయసు వచ్చిన పిమ్మట రాజ్యమును, ధనమును వారి స్వాధీనము చేయుమని వేడుకోనె నవియు, నందుఁ బెద్దవానిని తిమ్మరసు అను నాతఁడు చంపెననియు, నందుచే రెండవ వానిని సింహాసన మెక్కించి నరసనాయకుడు రాజభారమును దాను వహించి నడపెననియు న్యూనిజు అను పాశ్చాత్య చరిత్ర కారుఁడు వ్రాసియుండెననియుఁ జెప్పుచున్నారు .... తిమ్మరాజు ఆను పేరుగల శత్రురాజు (పెద్దవానిని) చంపియుండెననియు నభిప్రాయపడిరి. ఇదియే సత్యమై యుండును. తుళువ నరస నాయకుఁడే యతనిని జంపించెనని యొక యపవాదము కూడ కలదు. ఈ యపవాదమునకు భయపడి నరస నాయకుఁడు విశేష సమర్థుఁడయ్యును, నిజముగాఁ గర్ణాట రాజ్య సింహాసమును నధిష్టింపఁ గోరికయు, శ క్తియుఁ గలవా డయ్యును, నరసింగరాయల కుమారుని సింహాసన మెక్కించి, నామ మాత్రమున కాతనిని రాజుగా నుంచి తానే సర్వాధికారియై రాజ్యము చేయుచుండెను. కొన్ని