పుట:Aandhrakavula-charitramu.pdf/703

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

676

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

       బెనుగొండ సాధించె బెంగుళూరు హరించె
                        గోవెల గుంటూరు గుంటుపఱిచెఁ
        గుందాణి విదళించె గొడుగుచింత జయించె
                        బాగూరు పంచము పాడుచేసె
        నరుగొండ పెకలించె నామూరు మర్ధించె
                        సీరంగపట్నంబు బారిసమరె
       
        రాయచౌహత్తిమల్లధరావరాహ
        మోహనమురారి బర్బరబాహుసాళ్వ
        నారసింహప్రతాపసన్నహనుఁడగుచుఁ
        విశ్వహితకారి తిమ్మయ యీశ్వరుండు.

        *** *** *** *** ***

     గీ. ఇట్లు తుళువాన్వయాగ్రణి యీశ్వరుండు
        పూర్వజన్మతపఃఫలంబునఁ గులంబు
        ధన్యత వహింపఁ గన్న పుత్రకులలోనఁ
        బ్రభుత గైకొనె నరసింహపార్థివుండు.

        *** *** *** *** ***

    సీ. చర్చించి చూచిన సర్వజ్ఞతా పటు
                     ప్రౌఢిమ మరువంబుపరిమళంబు
        పరికించి చూచిన నిరుపమత్యాగల
                      లక్ష్మీవిలాసము దేవతావరంబు
        భావించి చూచిన బహుమానసమ్యక్ద
                      యావిశేషోక్తి శిలాక్షరంబు
        తర్కించి చూచిన ధర్మసంపాదన
                      క్రీడావివేకంబు తోడునీడ

        దుర్మదారాతిహరణచాతుర్యధైర్య
        వీర్యగాంభీర్యగుణములు వెన్నతోడఁ
        బెట్టినవి సాటి చెప్పుట యెట్టు నృపుల
        నీశ్వరప్రభునరసపృధ్వీశ్వరునకు.