675
నం ది మ ల్ల య్య , ఘం ట సిం గ య్య
వరాహపురాణమునకుఁ గృతీశ్వరుఁడైన నరసింగరాజుతండ్రియైన యీశ్వరరాజు సేనానాయకుఁడయి యుండి నట్టును, వీరిది తుళువాన్వయమయి నట్టును, చెప్పియున్నారు. ఈ నృసింహరాజునే నరసింగరాయఁ డనియు, పుస్తకములయందు వాడుదురు. ఈ యంశమును దెలుపు పద్యాదులలోఁ కొన్నిటిని వరాహపురాణమునుండి యిం దెత్తి చూపుచున్నాను.
సీ. తుహినాంశువంశపాథోరాశీమాణిక్య
మష్టదిగ్రాజభయంకరుండు
కర్ణాటరాజ్యరక్షణదక్షబాహాసి
వరవసంత త్యాగవైభవుండు
శివరాత్రిసమయసంశీలతాగుణశాలి
ధరణీసుపర్వవిస్తారకుండు
విరచితాతులతులాపురుషదానవిభూతి
సమదరాయకటారిసాళువంబు
గుండవీడు నారసింహమండలేశ్వ
రుండు గణుతింప రాజమాత్రుండు గాఁడు
కిన్నరస్త్రీసమూహజేగీయమాన
వర్తనంబులు గల చక్రవర్తి గాని.
**** **** **** ****
వ. అట్టి నరసింగరాజరత్నంబుచేత మన్నన వడసి సైన్యనాయకపట్టభద్రత్వంబున నిర్ని
ద్రవిజయలక్ష్మీమహత్వంబున మదపదభియాతి భయదసత్వంబున
దీర్ఘాయురైశ్వర్యధుర్యుండైన యీశ్వరనాయకునకుఁ
బ్రియతనూభవుండు,నరసవసుధాధ్యక్షుండు నిర్వంచితానుగ్రహంబునం బరిగ్రహించిన
యిమ్మహాప్రబంధంబునకు శృంగార విభూషణంబుగా తదీయవంశావతారంబు.
సీ. ఉదయాద్రి భేదించె హుత్తరి నిర్జించె
గండికోటపురంబుఁ గదలఁ ద్రవ్వెఁ