పుట:Aandhrakavula-charitramu.pdf/701

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

674

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

             
              రమణలు వింజామరములు వీవ
      వరబలాధికులైన శరణాగతారాతి
              సామంతు లుభయపార్శ్వములఁ గొలువ

      కూర్మితనయుఁడు నరసయ్య గుణనిధాన
      మంతికంబు సేవింప నలఁదికొన్న
      సురభికాశ్మీరగంధంబు సోడుముట్ట
      నుండె బేరోలగము నయనోత్సవముగ.

   క. మీ రిరువురు నేప్పుడును శ
      రీరప్రాణము క్రియఁ జరింతురు మిగులం
      గూరిమిఁ గృతిఁ బ్రతిపద్యము
      జారుగతిం జెప్పగలరు చాటువుగాఁగన్

   క. కావున మీరు దలంచిన
      శ్రీవారాహంబు మంచికృతి మా పేరం
      గావింపుఁ డనుచు సుముఖుం
      డై వీడ్యముఁ గప్పురంబు నర్పించుటయున్

ఇందలి మొదటి సీసపద్యమువలన నరసింహరాయని కొడుకైన (వీర) నరసింహరాయఁ డప్పటికే పెద్దవాడయి సభలో జనకుని సమీపమున నుండినట్టు తెలియవచ్చుచున్నది.

ఈ కవులు వరాహపురాణమునందు గృతిపతియైన నరసింహరాయని ప్రభువగు సాళువనృసింహరాజుయొక్క వంశాభివర్ణనము చేయుచు, చంద్రవంశపురాజయిన గుండరాజునకు సాళువ మంగరాజును, సాళువ మంగరాజునకు గౌతరాజును, గౌతరాజునకు గుండరాజును, గుండరాజునకు జై మినిభారతమును కృతి నందిన నరసింహరాజును పుట్టినట్లును, ఆ నృసింహరాజువద్ద