673
నం ది మల్ల య్య, ఘంట సిం గ య్య
మొనర్చిరి. [ఈ నరసింహరాయఁడు "నరసింహ విజయపురాణము, వరలక్ష్మీ కల్యాణము" అను రెండు గ్రంథములను కృతినందెననియు, ఆ కవులెవ్వరో ఆ గ్రంథములనుగూర్చిన విశేషము లేమియో తెలియరాలేదనియు, నరసింహ విజయ పురాణములను నరసింహరాయల విజయగాధలే వర్జింపఁబడి యుండవచ్చుననియును 'ఆంధ్రకవి తరంగిణి' లోఁ జెప్పఁబడి యున్నది. (సం. 8 పుట 121)] ఈ యీశ్వర నరసింహరాజప్పటికి రాజుగాక జైమినీభారతకృతిపతియైన సాళువ గుండనృసింహరాయని దండనాధుఁడుగా నుండెను. ఈశ్వరనరసింహరాయలు 1483 వ సంవత్సరమునందు కర్ణాటరాజ్యాధీశ్వరు డయ్యెను. అతఁడు రాజు కాకముందే వరాహపురాణ మతని కంకిత మొనర్పఁబడినందున 1483 వ సంవత్సరమునకుఁ బూర్వమునం దనఁగా 1480-85 సంవత్సర ప్రాంతములయందు పరాహపురాణము రచి యింపఁబడి యుండును. కవులీ క్రిందీ సీసపద్యభాగమున శ్రీనాధునిఁ గూడఁ బూర్వకవులలోఁజేర్చి పొగడిరి
గీ. నన్నపాచార్యునకు వందనంబు చేసి
తిక్కయజ్వకు మ్రొక్కి కీర్తితములైన
శంభుదాసుని వాగ్విలాసములు నెమ్మ
నంబులోపల నిలిపి శ్రీనాధుఁ బొగడి.
కృతిపతి యయిన నరసింహరాయఁడు నిండుకొలు వుండి తమ్ముఁ జూచి వరాహపురాణమును తన కంకితము చేయుఁ డని కోరినట్లుగా కవులీ క్రింది పద్యములలోఁ జెప్పి యున్నారు.
సీ. అష్టభాషాకవిత్వాజ్ఞసంభవులైన
సుకవిపుంగవుల సంస్తుతులు చేయ
సంకీర్ణ రాగరంజకులైన గాణల
గములు గీతప్రబంధములు పాడ
కలకంకణక్వాణకరసరోరుహలైన