43
న న్న య భ ట్టు
యరణ్యపర్వము రచించుచున్నాఁ డని చెప్పినమీఁదట నతఁ డింకను నరణ్యములోనేయున్నాఁడా ? యట్లే యుండునుగాక" యని శపించి తన పుస్తకముల నడఁగద్రొక్కె నన్న కోపముచేత నన్నయభట్టు రచించిన ఛందస్సును, వ్యాకరణమును అతని భార్య నడిగి పుచ్చుకొని వానిని చించి గోదావరిలోఁ గలిపివేసి తాను చిరకాలము కష్టపడి చేసిన గ్రంథములు పోయినవన్న దుఃఖముచేత బెంగపెట్టుకొని కాలధర్మము నొందినట్లును, ఆతని శాపము తగిలి నన్నయభట్టు వనములో మృతినొందినట్లును, అట్లు నశించిన వ్యాకరణము సిద్దులలోఁ గలిసిన సారంగధరుఁడు తాను చిన్న తనములో నేర్చుకొని యుండుటచేత మరల బాలసరస్వతి యను బ్రాహ్మణు నకుఁ జెప్పినట్లును, లోకప్రవాదము కలిగియున్నది. దీని కుపబలముగా నప్పకవీయమునందు
గీ. ఆంధ్రశబ్దచింతామణి వ్యాకరణము
ముందు రచియించి తత్సూత్రములఁ దెనుంగు
బాసచేఁ జెప్పె నన్నయభట్టు తొల్లి
పర్వములు మూఁడు శ్రీమహాభారతమున [ఆ 1-42 ]
గీ. భారతముఁ దెనిఁగించుచుఁ దా రచించి
నట్టి రాఘవపాండవీయము నడంచె
ఛందము నడంప నీఫక్కి- సంగ్రహించె
ననుచు భీమన యెంతయు నడఁచె దాని [ఆ 1 -44]
గీ. రాజరాజనరేంద్రతనూజుఁ డార్య
సఖుఁడు సారంగధరుఁడు శై_శవమునందు
నన్నయ రచించునెడఁ బరసం బొనర్చె
నన్యు లెవ్వ రెఱంగ రీయాంధ్రపక్కి. [ఆ 1-48 ]
క. ఆ లోకనుతుఁడు మొన్నటి
కీలకసమ నామతంగగిరికడ నొసఁగెన్
బాలసరస్వతులకు నతఁ
డోలిఁ దెనుఁగుటీక దాని కొప్పుగఁ జేసెన్ [ఆ 1-50 ]