42
ఆంధ్ర కవుల చరిత్రము
నన్న పద్యమునుగాఁ దెనిఁగించుచో 'ధారుణి రాజ్యసంపద మదంబునఁ గోమలిఁ గృష్ణఁజూచి రంభోరునిజోరు దేశమున నుండగఁ బిల్చిన ఇద్దురాత్ము" నన్నంతవఱకు కొత్తగాఁ జేర్పఁబడినది. గదతోనని మూలములో నున్నదానికీ 'దుర్వారమదీయబాహుపరివర్తిత చండగదాభిఘాత"ముచేత నని పెంచి చెప్పఁబడినది. పితృపితామహులలోకమునకుఁ దప్పినవాఁడ నగదు నన్న మూలములోని వాక్యము విడువcబడినది. పరిశీలించి చూచిన పక్షమున భాషాంతరమంతయు నిదే ప్రకారముగా నుండునుగాని సరిగా మూలము ననుసరించి యుండదు. మూలముతో సరిపోల్పక ప్రత్యేకముగాఁ జూచునప్పడు మాత్ర మాంధ్రభారతము మనోహరముగా నుండుననుటకు సందేహము లేదు. కొన్నిచోట్ల మూలమునకంటెను హృద్యతరముగానుండి రసాతిశయము పుట్టించుననుటయు నిర్వివాదాంశమే!
నన్నయభట్టారకుఁడు తాను రచియింప నారంభించిన శ్రీమహాభారతమును సంపూర్ణముగా నాంద్రీకరింపలేకపోవుటకుఁ గారణములు పలువురు పలు విధములుగాఁ జెప్పదురు. కొందరు వేములవాడ భీమకవి శాపముచేతఁ గలిగిన మరణము కారణ మందురు. మఱికొందఱధర్వణాచార్యులు తెలిఁ గించుచుండిన భారతమును తగులఁబెట్టించుట చేతఁ గలిగిన చిత్తచాంచల్యము కారణ మందురు. ఈ రెండు కారణములలో నేది నిజమైనను, ఈకవి పరోత్కర్షము సహింపఁజాలని దుస్స్వభావము కలవాఁడయిన ట్టూహింపఁదగి యున్నది. ఈయనతోడి సమకాలికుఁడైన వేములవాడ భీమకవి రాఘవపాండవీయమును, కవిజనాశ్రయములోఁ జేర్చి యెుక వ్యాకరణమును జేసి రాజసన్మానమును బొందుటకయి రాజమహేంద్రపురమునకుఁ దెచ్చి విష్ణువర్ధనుని యాస్థానపండితుఁడయియున్న నన్నయభట్టునకుఁ జూపఁగా నతఁ డాతనికవిత్వము మిక్కిలి శ్లాఘాపాత్రముగా నుండుట చూచి యోర్వలేక యా పుస్తకములు లోకములో వ్యాపించిన యెడలఁ దన పుస్తకములకుఁ బ్రసిద్ధి రానేరదనియెంచి వానిని తగులఁ బెట్టించినట్లును, అటు మీఁదట నతఁడింట లేనప్పడు భీమకవి వచ్చి యాతనిభార్యను నీభర్త యేమి చేయుచున్నాఁ డని యడిగి యామె తనభర్త రహస్యస్థలమున నుండి