పుట:Aandhrakavula-charitramu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


41

న న్న య భ ట్టు


ఉ. ధారుణి రాజ్యసంపదమదంబునఁ గోమలిఁ గృష్ణఁ జూచి రం
   భోరు నిజోరు దేశమున నుండఁగఁ బిల్చిన యిద్దురాత్ము దు
   ర్వార మదీయబాహుపరివ ర్తితచండగదాభిఘాతభ
   గ్నోరుతరోరుఁజేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్.
                                               (సభా.అశ్వా.248 -249 )

సంస్కృతమున మొదటిశ్లోకమునందుఁ గదళీ స్తంభసదృశమనియు సర్వ లక్షణసంయుత మనియు గజహస్తప్రతీకాశ మనియు వజ్రప్రతిమగౌరవ మనియు దుర్యోధనునితొడ వర్ణింపబడినది. దాని తెనుఁగు నందో రమ్య పృధూరుతలం బని మాత్రము చెప్పఁబడినది. చూచుచున్న ద్రౌపదికని సంస్కృతమున నుండఁగా తెనుఁగున ద్రౌపదికి విభీతహరిణాక్షి యనియు కలాపవిభాసికేశభారమున నొప్పుదాని ననియు కొత్తవిశేషణములు చేర్చఁబడినవి. రెండవ శ్లోకముయెుక్క పూర్వార్ధములోని రాధేయన కుబ్బు పుట్టించి భీమునకుఁ దిరస్కారము కలుగునట్లుగా నన్నమాటలు బొత్తిగా వదలివేయcబడినవి. మూఁడవ శ్లోకములోని భీమసేనుఁడు కనులెఱ్ఱచేసి దానిని తేఱిపాఱఁ జూచి యన్న వాక్యము 'దానిదూరమ్మునఁజూచి కౌరవ కురంగమృగేంద్రుఁడు భీముఁ డల్కతో' నని తెనిఁగింపఁబడి మూలములో లేని 'కౌరవకురంగమృగేంద్రుc' డను విశేషణ మధికముగాఁ జేర్పఁబడి నది. అటుతరువాత సభవారు వినునట్లుగా రాజమధ్యమునం దిట్లు పలికె నని యున్న శ్లోకముయొక్క యుత్తరార్ధమునకు "లయసమయదండధర నిర్ణయుఁడయి, ధరణీశు లెల్లఁ దనపలుకులు విస్మయ సంభ్రమసంభృతులై భయమున వినుచుండ నా సభన్ దగcబలికె" నని తెనుఁగుచేయబడినది. ఈ వాక్యము 'లయ సమయదండధరనిర్దయుఁ డయి' యనియు "విస్మయ సంభ్రమసంభృతులయి' యనియు మూలములో లేని మాటలు కవిచేc గల్పింపఁబడినవి. నీ యిూ తొడను గదచేత మహాయుద్ధమునందు విఱుగC గొట్టనియెడల వృకోదరుఁడు పితృపితామహాదులతోడి సాలోక్యమునకుఁ దప్పినవాఁ డగునన్న కడపటి శ్లోకమును "ధారుణి రాజ్యసంపదమదంబున"