Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/678

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

651

భై ర వ క వి

కును భైరవకవితండ్రి హరీశ్చంద్రోపాఖ్యానాదులు రచించిన గౌరన మంత్రియే యని యంగీకరింతము.[1]

“ఇది శ్రీమద్భ్రమరాంబావర ప్రసాదలబ్ధసిద్దసారస్వతగౌరన ' అని శ్రీరంగ మాహాత్మ్యమునందును,

     క. భ్రమరాంబికామహావర
        సముదితనిరవద్యహృద్యసాహిత్యకళా
        క్రమవిమల ప్రతిభాసం
        క్రమణుఁడ మతిశాలి నగౌరనసుతుఁడన్

అని రత్న శాస్త్రమునందును.

     క. శ్రీమత్పరమశివానన
        తామరసవికాసలీలఁ దనరిన భ్రమరాం
        బామధుమత్తభ్రమరిక
        నామానససరసీరుహమునన్ వసియించున్

అని కవిగజాంకుశమునందును. భ్రమరాంబావర ప్రసాదమువలనఁ దనకుఁ గవిత్వసంపద గలిగినట్టు కవి చెప్పుకొని యున్నాడు. ఈతని కవిత్వము పీఠికయందు పొగడినంత యుత్తమమైనది కాకున్నను గంగా ప్రవాహమువలె ననర్గళధార కల దయి, యుభయభాషాపాండిత్యాతిశయసంసూచకమయి

  1. [ భైరవకవి హరిశ్చంద్ర, నవనాధచరిత్రములకర్తయైన గౌరనపుత్రుఁడని ఊహించుటకుఁ జాలినన్ని యవకాశములున్నను, కవిగజాంకుశములోని పద్యములు లక్షణదీపిక యందుదాహరింపఁబడుటచే, - కుమారుని పద్యములు తండ్రి యుదాహరించుట అసంభావ్యము గాన - ఇర్వురును తండ్రి, కుమారులని తలఁచుట కుదరదని కొందఱి యాశయము, లక్షణదీపికలో కవిగజాంకుశములోని పద్యము లుదాహ రింపఁబడుట వాస్తవమే! అయినను, గుణగ్రాహియగు తండ్రి కుమారుని గ్రంథము నుండి యుదాహరించుటయు, కుమారుడు చిన్నతనముననే రచయిత యగుటయు నసంభావ్యములు కానేఱవని తోఁచుచున్నది. ఇట్టి పద్ధతి సంస్కృత వాఙ్మయమునను గానవచ్చుచున్నది ]