649
భై ర వ క వి
ప్రభుఁ డిమ్మడికి సామంతుఁడుగా నుండిన సైపఖానునొద్దనో యిమ్మడిసైపఖాను లిద్దఱియొద్దనో కొలువుండి రాజ్యభారమును తీర్చుచుండి యుండును. [1] అందుచేత విఠ్ఠలప్రభుని తమ్ముఁడైన రాఘవమంత్రి 1450-60 సంవత్సర ప్రాంతములయం దుండెనని యూహింపవలసి యున్నది. చతుర్థాశ్వాసాంతమునందలి యీ క్రింది పద్యమువలనఁ గృతిపతి సైపఖానునొద్దనే కొలువుండినట్లు తోఁచుచున్నది.
శా. థాటీవిభ్రమజృంభమాణనిజయోధవ్యూహబాహాధను
ర్జ్యాటంకారవిశంకటధ్వనివిశేషధ్వస్తనిస్తంద్రక
ర్ణాటోదీర్ఘబలార్ణ వార్భటితురంగారోహణోదారలీ
లాటోపార్కతనూజ చాగవిభురామామాత్యచూడామణీ.
కృతిపతి యైన రాఘవమంత్రి సభామండపంబునఁ గొలుపుండి తన్నుఁ బిలిపించి "శ్రీరంగమహత్త్వంబు మదంకితంబుగా నాంధ్రభాషాకౌశలంబు పచరించి రచియింపవలయునని యభ్యర్ధించి" నట్లు చెప్పుచోఁ గవి తన్నిట్లు చెప్పుకొనెను.
మ. కృతవిద్యాఖురళీపరిశ్రమకళాకేళీవిలాసున్ జన
స్తుతచారిత్రుని గౌతమాన్వయపవిత్రున్ గౌరనామాత్యస
త్పుత్రుఁ గళ్యాణకవిత్వలక్షణసమర్జున్ సూక్తి ముక్తాఫలా
తతకాంతిస్ఫుటచంద్రికోల్లసితవిద్వత్కైరవున్ భైరవున్.
అని తాను గౌతమగోత్రుఁడననియు. గౌరనామాత్యపుత్రుడననియుఁ జెప్పుకొని యుండుటచేత భైరవకవి హరిశ్చంద్ర నవనాథచరిత్రములను రచించిన
- ↑ [‘చండదిగ్వేదండ...' అను పద్యములోని 'ఇమ్మడి సైఫఖానాధిరాజ్య' అసుచోటఁ గల 'ఇమ్మడి' పదము ఇమ్మడి దేవరాయలనెడు ప్రౌఢ దేవరాయాలను తెల్పదనియు, ఇమ్మడి సైఫఖానన రెండవ సైఫఖానని యర్థమనియు 'ఆంధ్రకవి తరంగిణి' లో జెప్పఁబడినది. (సం. 5. పుట 219)]