Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/674

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

647

ద గ్గు ప ల్లి దు గ్గ య్య

 
        ఉ. సౌహృద మొప్పఁగా గురుని సమ్మతి నాథుఁడు వేలిపింప వై
            వాహిక వహ్నికీలముల వామవిలోచన లీల వేల్చులా
            జాహుతి చూడ నొప్పెసఁగె నప్టు కళాధరఖండభృ జ్జటా
            వ్యూహములోపలం దొరుగుచుండెడు వేలుపుటేటికైవడిన్.

ఆంధ్రపరిషత్పుస్తకభాండాగారములోవి యదాహరణ గ్రంథములో దగ్గుపల్లి దుగ్గన శివకంచి మాహాత్మ్యములోనిదని యీ క్రింది పద్య ముదాహరింపఁ బడినది,

        సీ. బంధూక మెఱమించెఁ బరువయ్యె గేదంగి
                             కడిమి పుష్పిత మయ్యె గ్రంథి పూచె
           నర్జునం బలరారె నరవిందములు గ్రుస్సె
                             భూస్థలి నేరులు పుక్కిలించె
           గండూపదము లుబ్బె గలఁగె హంసచయంబు
                             నటియించెఁ గప్పలు నమిలి చెలఁగె
           చాతకంబులు మించె సాగరం బెడయించె
                             హరిగోపములతోడ నాటె వేళ్ళు

           మత్తభృంగములకుఁ దేనె రిత్త యయ్యె
           గండుఁగోయిలకూఁతలు కట్టువడియె
           చూలుకొనె స్వాతి కొక్కెరజూటిఁ బొదవె
           విష్ణునకు నిద్రపోయేడువేళ యయ్యె.

ఆ పుస్తకమునందే విష్ణుకంచిమాహాత్మ్యమును ఆంధ్రకవి రామయ్యచెప్పినట్టిందులోనిపద్యము లుదాహరింపఁబడినవి.[1]

  1. [శివకాంచీమాహాత్మ్యములోనీ వేఱొక సీసపద్యముకూడ శ్రీ ప్రభాకర శాస్త్రి కూర్చిన 'ప్రబంధ రత్నావళి' లోఁ గలదు.]