పుట:Aandhrakavula-charitramu.pdf/673

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

646

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

యుండుటచేత నీ కడపటి పుస్తకము 1450 వ సంవత్సరప్రాంతముల యందు రచియింపఁబడి యుండును. నాచికేతూపాఖ్యానములోని మొదటి మూడాశ్వాసములు మాత్రమే యిప్పుడు కనఁబడుచున్నవి గాని సంపూర్ణగ్రంథ మెక్కడను లభింపకున్నది. ఈతఁడు రచియించిన కాంచీపుర మాహాత్మ్యమును జదువఁగల భాగ్యము నాకు లభింపలేదు.[1]

దుగ్గనకవిత్వము సలక్షణమయి సరసమయి సకలజనాదరణీయముగా నున్నది. ఈతని కవిత్వ శైలి తెలియుటకయి యీతని పుస్తకములలోని కొన్ని పద్యముల నిందుదాహరించు చున్నాను

     మ. మకరందంబులఁ దొప్పఁదోఁగి వికచన్మందారమాకంద చం
         పకసౌరభ్యముఁ బూని లేఁజిగురుజొంపంబు ల్మొగిం జొచ్చి పా
         యక మందానిలుఁ డెందుఁ గ్రుమ్మఱు దపోవ్యాపిభ్రమత్తాపసీ
         సకలాంగోదితఘర్మవారికణికాజాలంబు నింకించుచున్

     ఉ. మున్నొకనాఁటిరాత్రి కనుమూసినచోఁ గల వచ్చి వేడుకన్
         నన్ను దృఢోపగూహనమునం గరఁగించి మొఱంగి చన్న యా
         పిన్నది గాదె యీ యువతి పెక్కువ నొందిన దిప్టు నాఁటికిం
         గన్నియ గానఁ బ్రాయ మిది గామి నెఱుంగఁగరాదు గ్రక్కునన్.

     ఉ. కోమలి వింటివే యతఁడు కూరిమిపుత్త్రుడు నాకు మున్ను పెం
         దామరమొగ్గలోన విదితంబుగ డాచినయట్టి తేజమున్
         మామక మించుకేని యనుమానము లే దిది తధ్య మిమ్మెయిన్
         దామరసప్రసూతిచెయిదంబులు వట్రిలె నిట్టిచందముల్.

     చ. జిలిబిలిముద్దుచేఁతలకు సిగ్గులనిగ్గులు వన్నెపెట్ట వే.
         నలి యరవిడుచుండఁ జరణంబులు తొట్రిలఁ గ్రాలుఁగన్నులం
         దొలఁకెడు మందహాసములు తొంగలిఱెప్పలలోన డాఁగఁగా
         నలికులవేణి యోసరీలె నల్లన పయ్యెద నోసరించుచున్

  1. [కాంచీపురమాహాత్మ్యమింతవఱకును లభింపలేదు.]