ఈ పుట ఆమోదించబడ్డది
40
ఆంధ్ర కవుల చరిత్రము
తిక్కనసోమయాజినిగూర్చి వ్రాయునపు డీ విషయము కొంత వివరింపఁబడును. దుష్యంతునికంటె యయాతి యెంతో పూర్వcడగుటచేత ముందుగా యయాతిచరిత్రమును జెప్పటయే సమంజసము కావచ్చును. నన్నయకాలపు భారతప్రతులలోఁ గూడ నొకవేళ పార మట్లే యుండిన నుండ వచ్చును. ఈ కవులు సంస్కృతశ్లోకములను తెలిఁగించెడు రీతిని తెలుపుట కయి రెండు మూడు శ్లోకములను, వానికి సమములయిన పద్యములను మాత్రమిక్కడ నుదాహరింపఁబడుచున్నవి -
సంస్కృత సభా పర్వము శ్లో. కదళీ దండసదృశం సర్వలక్షణసంయుతమ్, గజహస్తప్రతీకాశం వజ్రప్రతిమగౌరవమ్. అభ్యుత్మ్సాయిత్వా రాధేయం మాథర్షయ న్నివ. ద్రౌపద్యాః ప్రేక్షమాణాయా స్సవ్యమూరు మధర్షయత్.
భీమసేన స్తమాలోక్య నేత్రే ఉ(?)త్ఫాల్య లోహితే ప్రోవాద రాజమధ్యే తం సభాం విశ్రావయ న్నివ. పితృభి స్సహ సాలోక్యం మా స్మ గచ్ఛేద్వృకోదర8, యద్యేతమూరుం గదయా న భేద్యాం తే మహాహవే.
తెలుఁగు సభాపర్వము
ఉ. అమ్ముదిత న్విభీతహరిణాక్షిఁ గలాపవిభాసికేశభా రమ్మున నొప్పుదానిఁ దన రమ్యపృథూరుతలంబు నెక్కఁగా రమ్మని సన్న చేసె ధృతరాష్ట్రసు తాగ్రజుఁ డప్డు దాని దూ రమ్మునఁ జూచి కౌరవకురంగమృగేంద్రుఁడు భీముఁ డల్కతోన్.
క. లయసమయ దండధర ని ర్దయుఁడై ధరణీశు లెల్లఁ దన పలుకులు వి స్మయసంభ్రమసంభృతులై భయమున వినుచుండ నా సభం దగఁ బలికెన్,