పుట:Aandhrakavula-charitramu.pdf/665

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

638

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

       విను వినకుండుము వివరించుకొనుము
       కొనకుండు మనుచును గుటిలాత్ముఁ డతని
       చెవి డాసి కూఁతురుచే వ్రాఁతఫలము
       వివరించి చూచితి విను మీ కుమారి
       నీయింటి నుండిన నీవు నీ ప్రజలు
       నీయేలు దేశంబు నిర్మూల మగుదు
       రన విని భీతితో నతఁ డాడుమాట
       తనకు నంతకుమున్ను తార్కాణ యగుట
       తలపోసి యక్కట ! తల్లి పెంచినది
       యెలమి నీబాలిక నేగతి విడువ
       నొడఁబడు బుద్ధి నీయువిదయె నాకుఁ
       గొడు కై నఁ గూతైనఁ గూర్మి నెక్కొన్న.

        * * * * *

       వెఱతుము నీమాట వేరెదు గడవ
       నెఱిఁగింపు మీ పాప నేమి చేసెడిది ?
       నావుడు సిద్ధించె నాకోరి కనుచు
       భావంబులోపలఁ బ్రమదంబు నొంది
       యాతఁ డిట్లనె వసుధాధిప ! మిగుల
       చాతురిగా మందసంబును జేసి
       యా లోన మణికనఁకాంబరాభరణ
       జాలంబుతోడ నీ చపలాక్షి నునిచి
       తలుపులు వదలించి తగుతెప్పఁమీదఁ
       బొలుపొంద నునిచి యుప్పొంగుపెన్నీట
       వెసఁ బాఱవిడిచిన వేవేగ శుభము
       లెసఁగు మీ కెల్లను నేలనాగభాగ్య
        
       ... ... ... ...