పుట:Aandhrakavula-charitramu.pdf/663

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

636

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

    చ. అనఘచరిత్ర ! మీ మృదుపదాబ్జము మామకరత్నయుక్త కాం.
        చనమకుటంబుతో నొరసి చాలఁగ నొప్పి వహించె; నే నొన
        ర్చిన యపరాధ మేది యిటు చేయఁగ ? నానతియిండు నావుడున్
        మునికులముఖ్యు డిట్లనియె మో మరుణాంబుజకాంతి నీనఁగన్.

     క. ఒకపాద మనఁగ నేటికి ?
        సకలాంగంబులును నొచ్చే సాహసవృత్తిన్
        మొకమోడక నీచేసిన
        సకుటిలకృత్యముల మాకుఁ జర్చింపంగన్. [శంకరకవి ]


     శ్లో. పీడితో య న్మహాభాగ ! పాదస్తే నీరజోపమః,
        కఠినోజ్వలపాషాణ కిరీ టే వినియోజితః,
        తత స్తం ప్రాహ కుపితో విశ్వామిత్రో మహాతపాః,
        న మే ఖిన్నం పాదమాత్రం సర్వాంగం త్వద్విచేష్టితైః
                                                                 [స్కాందము]

గౌరనకవి రచియించిన రెండవ ద్విపదకావ్యము నవనాధచరిత్రము. ఈ శివ కథలలోని మూడవ యాశ్వాసములోని ముఖ్య కధ ఒక బ్రాహ్మణుఁడు సౌందర్యవతియు, యౌవనవతియు నైన రాజపుత్రిని గామించి మాయోపాయముచేత నామెను దక్కించుకోఁ దలఁచి యా రాజపుత్రి రాజమందిరమునం దుండుటవలన రాజ్యమును, రాజవంశము ను నిర్మూలమగుననియు, ఆ యాపద తొలగించుటగయి యా మెను స్వర్ణరత్నాభరణపూర్తమయిన యొక మందసయం దుంచి తలుపులు మూసి దాని నొక తెప్పఁమీదఁ బెట్టి నదీ ప్రవాహములో విడువవలయుననియు, చెప్పి రాజును నమ్మించి యొప్పించి, రాజా ప్రకారముగాఁ జేసి పిమ్మట నేటివాలునఁ బడి కొట్టుకొని పోయెడి పెట్టెను బట్టుకొని యొడ్డునఁ బెట్టి మఱుఁగుస్థలములోఁ బదిల పఱుపుఁ డని ముందుగానే శిష్యులను నియమించి యుంచెను జ్యోతిషఫలము నందు మూఢవిశ్వాసము గల యా రాజశిఖామణి విప్రవాక్యమును వేదవాక్య