Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/662

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

635

గౌ ర న మం త్రి

     ఉ. భూతలమందుఁ జేరి నినుఁబోలు మునిప్రవరుల్ సహస్రసం
         ఖ్యాతశతాయుతంబు లధికంబుగ మాయలు పన్ని దుఃఖసం
         జాతమనస్కు జేసిన నిజంబుగ నెమ్మది నిల్పఁ డెన్న ని
         ర్దూతకళంకుఁ డాతఁ డనృతోక్తులు దాఁగలలోన నేనియున్. [శరభకవి]

  5. ద్వి. వరుస నిక్ష్వాకుభూవరునాఁటనుండి
          పరిణామ మెసఁగ మీ పదములచెంతఁ
          జల్లగా మహి చెల్లచనువుల మాకుఁ
          జెల్లగా నుంటిమి, చెల్లఁబో నేఁడు
          మదిలోన నిటు దయమాలి కుయ్యిడఁగ
          వదలక యీ మునివ్యాఘ్రంబువాతఁ
          బొదివి త్రోచెడు పశుపుంజంబువోలె
      
             * * * * *

          గజిబిజి నొంది యిక్కడఁ దల్లి లేని
          ప్రజలమై బాములఁ బడఁజాల మేము. [గౌరన.]

      మ. అలఘుప్రాభవ ! మమ్ము మీర లిది పర్యంతంబు సత్ప్రేమచేఁ
          దలిఁదండ్రిన్ మఱపించి పెంచి చటులోద్యత్క్రోధివై నేఁడు బె
          బ్బులివాతం బడఁద్రోచి పోవఁదగునే ? భూనాధ ! మానేర మే
          వలనం జూచితి ? వైనఁ గావఁ దగదే వర్ణింప ముమ్మాటికిన్
                                                             [శంకరకవి.]
   6. ద్వి. అనఘాత్మ ! నీకోమలాంఘ్రిపద్మమ్ము
           ఘనవజ్రమకుటసంగత మైనయట్టి
           నా మస్తకంబు మిన్నక సోఁకి నొచ్చె
           నేమి తప్పొదవె నాయెడఁ జెప్పుమనిన
           గిటగిట పండ్లను గీటి కౌశికుఁడు
           చిటచిట మిడుగుర్లు చెదర వీక్షించి
           తలపోయ నొక పాదతల మన నేల ?
           కలయంగ నిఖిలాంగకంబులు నొచ్చె. [గౌరన.]