పుట:Aandhrakavula-charitramu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


39

న న్న య భ ట్టు


 
       కరలీలన్ వధియించి తద్విపులవక్షశ్శైలర క్తౌఘని
       ర్ఘర ముర్వీపతి చూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్. (సభా. ఆ 2 -233)


ఈయనకవిత్వమంతయు మొత్తముమీఁద రసపుష్టి కలదిగానే యున్నను, ఆరణ్యపర్వమునందలి కొన్ని భాగములు మాత్రము నిస్సారములుగాఁ గనఁబడుచున్నవి. అవసానకాలమునకు ముందు రోగబాధచేతనో చిత్తవైకల్యముచేతనో బుద్ధిబలము తగ్గియున్నప్పడవి చేయబడియుండవచ్చును. కవిత్వనైపుణి యెట్లున్నను కధమాత్రము మూలగ్రంధమగు వ్యాస విరచితసంస్కృతభారతమునకు సరియైన భాషాంతరముకాదు. ఈ కవి యొక్కఁడు మాత్రమే గాక సంస్కృతపురాణములను తెనిఁగించిన యాంధ్ర కవు లందఱునుగూడ తమయిష్టానుసారముగాఁ గొన్నిచోట్ల మూలగ్రంధములోని కధలను సంగ్రహపఱిచియు కొన్నిచోట్ల పెంచియు, కొన్నిచోట్ల కథలను మార్చి వేఱుకధలను చేర్చియు, కొన్నిచోట్ల కధలు తాఱుమాఱు చేసియు, కొన్నిచోట్ల నూతనకథలను గల్పించియు, కొన్నిచోట్ల మునుపున్నవానిని బొత్తిగా తీసివేసియు యధేచ్ఛములయిన వర్ణనలుపెట్టియు ప్రధానకథాంశమునుమాత్రము వదలక నానావిధముల మూలగ్రంధముల కంటె తమ గ్రంధములు భిన్నములుగా నుండునట్లు చేసిరి. ఈ హేతువు చేతనే సంస్కృతమున లక్ష యిఱువదియైదువేలు గల భారతము తెనుఁగున నేఁబదివేల గ్రంధమునకు దిగినది. ప్రతిపదార్ధభావప్రథానము లైన కావ్య నాటకములందు మాత్రమే భాషాంతరము సరిగా మూలానుసారముగా నుండ వలెను గాని కేవలకథామాత్రప్రధానములై న పురాణేతిహాసములయందట్లు గాక వినువారి వీనుల కింపుగా నుండునట్లు కధను యధేచ్చముగా వ్రాయుటయే సముచితమని కొందఱనుచున్నారు. అట్లే కావచ్చును. నన్నయ భట్టాదిపర్వమునందు సంస్కృతమున శకుంతలకధ తరువాత నున్న యయాతి చరిత్రమును శకుంతలోపాఖ్యానమునకు ముందుంచుటయు, ధృతరాష్ట్రునకు కణికుఁడు చెప్పినట్లున్న జంబుకాదులకథ మొదలయినవానిని తెనిఁగింపక విడిచివేయుటయు, పయిపొనికి దృష్టాంతములుగా గ్రహింపవచ్చును.