పుట:Aandhrakavula-charitramu.pdf/634

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

607

బ మ్మె ర పో త రా జు

ఈ కవియొక్కయు భాగవతమును పూరించిన యితరకపులయొక్కయు శైలి తెలియుటకయి కొన్ని పద్యములుదాహరించి యీ చరిత్రమును ముగించుచున్నాను.

1. బమ్మెరపోతరాజు - భాగవతము.

ఉ. త్రిప్పకుమన్న మా మతము దీర్ఘములైన త్రివర్గపారముల్
    దప్పకుమన్న నేఁడు మన దైత్యవరేణ్యునిమ్రోల మేము మున్
    జెప్పినరీతిఁగాని మఱిచెప్పకుమన్న విరోధి శాస్త్రముల్
    విప్పకుమన్న దుష్టమగు విష్ణుచరిత్ర కథార్థజాలముల్ - సప్తమ స్కంధము.

ఉ. పుణ్యుఁడు రామచంద్రుఁ డటుపోయి ముదంబునఁ గాంచె దండకా
    రణ్యముఁ దాపసోత్తమశరణ్యము నుద్ధతబర్హిబర్హ లా
    వణ్యము గౌతమీవిమలవాః కణపర్యటన ప్రభూతసా
    ద్గుణ్యము నుల్లసత్తరునికుంజవరేణ్యము నగ్రగణ్యమున్.
                                                  నవమస్కంధము.
వీరభద్ర విజయము

శా. ఏరా దక్ష ! యదక్షమానస ! వృధా యీ దూషణం బేలరా ?
     యోరీ ! పాపము లెల్లఁ బో విడువురా యుగ్రాక్షుఁ జేపట్టురా
     వైరం గొప్పదురా శివుం దలఁపురా వర్ణింపురా రాజితోం
     కారాత్ముం డగు నీలకంరుఁ దెగడంగా రాదురా దుర్మతీ ! ఆ. 1

శా. వీరంభోనిధి నేఁడు మీ యలుకకు న్వీరెంతవారయ్య స
     త్కారుణ్యంబునఁ గాతుగాక యని యా కష్టాత్ములం బోరిలోఁ
     గారింపం గబళింప నీ ప్రమథుఁ డొక్కండైనఁ జాలండె దు
     శ్చారు ల్దివ్యులు వీరి నెన్నక మదిన్ సైరించి రక్షింపవే. ఆ. 4.

2. గంగన - పంచమస్కంధము.