పుట:Aandhrakavula-charitramu.pdf/630

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

603

బ మ్మె ర పో త రా జు

కారణమనియు నా యభిప్రాయము. కొందఱు భాగవతమును తప్పుల కుప్పఁగా నెంచఁగా మఱి కొందఱు భాగవతమునందు దోషములే లేవని సాధింపఁ జూచుచున్నారు. ఈ కడపటితెగవారిలో కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసంగ్రహమునందు

      సీ. అఖిల వేదాంతవిద్యారహస్యవిదుండు
                     సహజపాండిత్యవిశారదుండు
         మత్తక్షితీశాధమస్తోత్రవిముఖుండు
                     శంభుపదాబ్జపూజారతుండు
         పటుతరకవితావిభాసిత ప్రముఖుండు
                     సకలాంధ్రలక్షణచక్రవర్తి
         రఘుకులేశనిదేశరచితమహాభాగ
                     వతపురాణుఁడు పుణ్యవర్ధనుండు

         బుధజనహితుండు బమ్మెర పోతసుకవి
         యెన్న రేఫఱకారంబు లెఱుఁగఁ డనుచు
         నజ్ఞు లొకకొంద ఱాడుదు, రామహాత్ము
         కవిత కెందును లోపంబు గలుగ దభవ !

అని వ్రాసి, “పోతరాజు చెప్పినవి ప్రధమస్కంధమును, ద్వితీయస్కంధము కొంతయు షష్ఠస్కంధము సప్తమాష్టమ నవమస్కంధములును, దశమ పూర్వభాగంబు కొంతయు నున్న" దని చెప్పి యీ భాగములలో రేఫఱ కారముల మైత్రీ లేనందున కుదాహరణము లిచ్చి యున్నాఁడు. అంతేకాక వెలిగందల నారయాదుల కవిత్వమునందు రేఫ ఱకారమైత్రి యున్నందుకు ద్వితీయస్కంధము నుండియు, తృతీయస్కంధమునుండియు చతుర్థ స్కంధమునుండియు, పంచమస్కంధమునుండియు, దశమోత్తరభాగమునుండియు పద్యముల నుదహరించి యున్నాడు. ముద్రింపఁబడిన భాగవతమునందలి షష్ణస్కంధకృత్యాదినిబట్టియు, నాశ్వాసాంత గద్యములను బట్టియుఁ జూడఁగా