Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/628

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

601

బ మ్మె ర పో త రా జు

        
        గీ. అరయ గురురేఫ హల్లుతో బెరసినపుడు
           ప్రాసముల విశ్రమముల రేఫములతోడఁ
           గలసి యుండును సుకవిపుంగవుల కృతుల
           జగదవనసూత్ర ! గీరితనూజాకళత్ర ! [1]

అని తిమ్మకవి సార్వభౌముఁడు లక్షణము వ్రాసి యీ క్రింది పద్యములను లక్ష్యములనుగాఁ జూపియున్నాడు.

       ఉ. నూఱ్వురు నొక్కచందము మనోగతి సైరణ చేసి నన్ను నా
           సర్వకులంబు నుత్తమయశంబున నుంచితి రమ్మలార మీ
           కుర్విని సాటీయే యబల లొండులు దేవతలం బటుక్షమా
           నిర్వహణం బొనర్చుటకు నేరరు మర్త్యులఁ జెప్పనేటికిన్
                                               - ఎఱ్ఱాప్రెగడ రామాయణము

        క. కాఱ్చిచ్చు గవిసి మృగముల
           నేర్చుకరణి నేఁడు భీష్ముఁ డేచినకడిమిం
           బేర్చి మనభీముఁ బొదవె శ
           రార్చుల నవ్వీరుఁ గన్ను లారఁగఁ గంటే - భీష్మ పర్వము

        క. చెలగి పటుసింహనాదం
           బులు ఱంకెలుగాఁగ వారు పొలిచిరి వృషభం
           బుల క్రియ నొండొరులకు మా
           ఱ్మలయుచుఁ దాకుచు నుదాత్తరభసోజ్జ్వలులై - ద్రోణపర్వము.

మనవారు కొంద ఱిప్పుడు సంయోగమునందు ఱకారము రేఫముగా మాఱునని చెప్పుచున్నారు మఱికొందరు భారతమునందుగూడ,

  1. (వేఱొక హల్లుతోఁ గూడినపుడు శకటరేఫముఖము లఘురేఫమే యగునని యాధునిక లాక్షణికుల యాశయము.)