Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/625

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

598

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

ఆని కవిజనాశ్రయమునందు రేఫఱకారములకు మైత్రి చెప్పఁబడి యున్నది. రేఫఱకారములు ప్రాసలయందు మైత్రిఁ జెందగూడకున్నను యతులయందుఁ జెందవచ్చునని కొందఱి యభిప్రాయము.

            గీ. చఛజఝలకును మొదలియూష్మములు మూడు
               సరసవడి నిల్పఁగా నేకజాతియైన
               బండిఱాకు రేఫము వడి కుండరాదె?
               ప్రాసవర్ణంబులకుఁ గూర్పరాదు గాని.

అని శారదాదర్పణమునందుఁ జెప్పఁబడి యున్నది. కాని యిటీవలివారందఱును రేఫఱకారమైత్రి నన్నయభట్టమతము కాదని భ్రమించి రేఫఱకార మైత్రిని దూషించి యా మత మవలంబించి నవారిని కుకవులని దూషించి యున్నారు. అట్లు దూషించినవారిలో నొకఁ డయిన కాకుసూర్యప్పకవి రేఫఱకారముల ప్రాముఖ్యమును స్థాపింప నెంచి భాగవతమును బూర్వలాక్షణీకులు లాక్షణిక గ్రంధమునుగా నంగీకరింపకపోయినందుకు రేఫఱకారములు ప్రాసలయందు మైత్రి చెందుట యొక్కటియే కారణ మని యీ క్రింది పద్యముచేతఁ జెప్పియున్నాఁడు

            ఉ. బమ్మెరపోతరాజకృత భాగవతంబు సలక్షణంబు కా
                కిమ్మహి నేమిటం గొదవ ? యెంతయు నారసిచూడఁగాను రే
                ఫమ్ములు ఱాలునుం గలిసి ప్రాసము లైన కతంబునం గదా
                యిమ్ముల నాదిలాక్షణికు లెల్లను మాని రుదాహరింపఁగన్.

ఇట్లు రేఫఱకారముల నిమిత్తమయి యింతగాఁ బెనఁగులాడిన యప్పకవియే తన కా భేదము తెలియక వానికి యతిప్రాసములయందు మైత్రికూర్చి తానును తా నభివర్ణించిన కుకవిసమూహములోనే చేరినందున కోగినాల రంగనాథకవీశ్వరుఁడు ద్విరేఫ దర్పణమునం దుదాహరించిన యప్పకవి పద్యముల రెంటిని మాత్ర మిందుఁ జూపుచున్నాను.