పుట:Aandhrakavula-charitramu.pdf/623

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

596

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

అని వ్రాయఁగాఁ జూచి శ్రీనాధుఁడు విష్ణుమూర్తి మకరమును జంపి భక్తుని ప్రాణములఁ గాపాడఁబోవునప్పుడు ‘చక్రాద్యాయుధములను వెంటఁ గొనక కఱువఁబోయెనా ? గిల్లఁబోయెనా ? లేక వేడుకచూడఁ బోయెనా?' యని యాక్షేపించె ననియు, పోతన యప్పు డేమియుఁ [బ్రత్యుత్తరము చెప్పక భోజనకాలమునందుఁ దన కేదో పని యున్నదని చెప్పి ముందుగా లేచి పోయి శ్రీనాధునికొమారు నెక్కడనో దాఁచివచ్చి నూతిలోఁ పెద్దఱాయి వేసి శ్రీనాధునికుమారుఁడు నూతిలోఁ బడెనని కేక వేసెననియు, శ్రీనాథుఁడా కేక విని తాను తినుచున్న పెరుగన్నమును విడిచి యెంగిలిచేతితో పరుగెత్తుకొనివచ్చి విచారముతో నూతిలో తొంగి చూచుచుండఁగాఁ జూచి బావా ! త్రాళ్ళును. నిచ్చెనయు దిగు మనుష్యులును లేక నూతిచుట్టును గంతులు వేయ వచ్చినావా ? వేడుక చూడ పచ్చినావా ? యని యడిగి, 'నీ కున్న పుత్రవాత్సల్య మిప్పు డెట్లు పరికరములమాట విచారింపనీక నిన్ను పరుగెత్తించినదో, విష్ణుమూర్తికున్న భక్తవత్సల్య మట్టే యాతనిని పరికరములమాట విచారింపనీక పరుగెత్తునట్లు చేసిన' దనియు, 'కావలసినప్పుడు పరికరము లన్నియు వెనుక వచ్చు' ననియు, ప్రత్యుత్తరము చెప్పెనఁట! పోతనకవిత్వమునందుఁ గొన్ని లక్షణవిరుద్ధములైన ప్రయోగము లుండుట చేత వెల్లంకి తాతంభట్టు మొదలయిన పూర్వలాక్షణికులు దానిని సలక్షణ గ్రంధముగా నంగీకరించినవారు కారు. అట్లంగీకరింపకపోవుటకుఁ గారణము రేఫ ఱకారములకు యతిప్రాసములందు మైత్రి యుండుట యని వా రెక్క డను జెప్పి యుండలేదు. రేఫఱ కారములకు మైత్రి యుండఁగూడదని నన్నయభట్టారకాదుల యభిప్రాయ మగునా ? యనియు సంశయింపవలసి యున్నది. నన్నయభట్టు రేఫములనుగా ప్రయోగించినవానినిఁ గొన్నిఁటిని శకటరేఫములనుగాను శకటరేఫములనుగా బ్రయోగించినవానిని గొన్నిటిని రేఫములనుగాను తిక్కన ప్రయోగించి యున్నాఁడు. అయినను రేఫశకట రేఫముల విషయమయి పెనఁగులాడువారు వాని కన్నిఁటికీని ద్విరూపములు కలవని చెప్పుదురు. అట్లనినపక్షమున రేఫములకును ఱాలకును మైత్రి లేదను తమవాదము పడిపోవునన్న భీతిచేత పన్నిన *[1] పన్నుగడ కాని

  1. (ఇది పన్నుగడయో, భాషాతత్త్వ పరిశీలన దృష్టితోఁ జేయబడినదో విమర్శకులు నిర్ణయింపఁ దగుదురు.)