పుట:Aandhrakavula-charitramu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


35

న న్న య భ ట్టు

వచ్చెను. ఇతcడు చోళరాజ్యమును 1158 వ సంవత్సరము వఱకును పాలించెను. ఇతని కొడుకు రాజేంద్రచోడుఁడు పండ్రెండవ శతాబ్ద్యంతము వఱకును, రాజేంద్రచోడుని కొడుకు రాజరాజచోడుఁడు 1232 వ సంవత్సరము వఱకును, చోడరాజ్యమును పాలించినట్టు కనఁబడుచున్నది. ఈ రెండవ కులోత్తుంగచోడ దేవుని కాలములోనే వేఁగిదేశ మితర చాళుక్యుల యధీన మయినట్టు స్పష్టముగాc గనఁబడుచున్నది. 1202 వ సంవత్సరము నందు మల్లవిష్ణువర్ధనుఁడు వేంగిదేశప్రభువుగా నుండినట్టొక శాసనము నందున్నది. ఆ శాసనమునందే యాతని తండ్రి విజయాదిత్యుఁడు చిర కాలము వేఁగిదేశమును బాలించినట్టును జెప్పఁబడియున్నది. దీనినిబట్టి చూడఁగా రెండవ కులోత్తుంగ చోడ దేవునికాలములోనే విజయాదిత్యుఁడు వేంగిదేశరాజ్యమును వహించినట్టు తోఁచుచున్నది. ఈ విజయాదిత్యుఁడు పైని వివరింపఁబడిన పదునేఁడవ తూర్పుచాళుక్యరాజగు బేటవిజయా దిత్యుని కాఱవతరమువాఁడు. బేటవిజయాదిత్యుని కొడుకు సత్యాశ్రయుఁడు; సత్యాశ్రయునికొడుకు విజయాదిత్యుఁడు, విజయాదిత్యునికొడుకు విష్ణువర్షనుఁడు; విష్ణువర్ధనునికొడుకు మల్లప్పదేవుఁడు; మల్లప్పదేవుని కొడుకు వేంగిదేశ ప్రభువైన విజయాదిత్యుఁడు. 1228 వ సంవత్సరము నందు కృష్ణాగోదావరీ మధ్యమునందున్న వేఁగి దేశమంతయు గణపతిరాజుల యధీన మైనది. కులోత్తుంగచోడదేవుని కాలమునుండియు చాళుక్య చోడు లందఱును తాము వేఁగి దేశమును విడిచి చోళుల బిరుదావళులను వహించి తాము చోళులుగానే పరిగణింపఁబడుచు వచ్చుటచేత వారినిగూర్చి యిందు వివరించుట యనావశ్యకము. చాళుక్యులు చంద్రవంశపురాజులు; చోళులు సూర్యవంశపురాజులు; *[1] ఈ క్రిందిది చాళుక్యుల వంశవృక్షము.

  1. * ఈ చాళుక్యులు సూర్యవంశమువారు గాని, చంద్ర వంశమువారు కాని కారనియు, వీరు దక్షిణాత్యులును, ద్విజేతురులునైయుండి తమ వంశమునకు గౌరవము నాపాదించుటకై యీ గాథలను కల్పించుకొని వానిని శాసనములలోని కెక్కించికొనిరనియు నవీన చరిత్ర కారులను చున్నారనియు అది సత్యమే కావచ్చుననియు 'ఆంధ్రకవి తరంగిణి'లోఁగలదు (పుట 71)